CMS - Combined Medical Service
సీఎంఎస్ ఇంటర్వ్యూ ఏవిధంగా ఉంటుంది?
+
సీఎంఎస్ రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. గరిష్టంగా వంద మార్కులు కేటాయించిన ఇంటర్వ్యూలో అభ్యర్థి జనరల్ నాలెడ్జ్‌ను, వ్యక్తిగత ఆసక్తులను, నిర్ణాయక సామర్థ్యం, సామాజిక దృక్పథం, లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను పరిశీలిస్తారు.
సీఎంఎస్‌కు ఎంపికైన వారి పే స్కేల్ ఎంత?
+
పే స్కేల్: ’ 15600 - 39100. విత్ గ్రేడ్ పే ’ 5400. బేసిక్ పే (పే బ్యాండ్ + గ్రేడ్ పే)కు 25 శాతం సమానమైన నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్
సీఎంఎస్ పేపర్-2లో ఎటువంటి ప్రశ్నలు వస్తాయి?
+
సీఎంఎస్ పేపర్-2లో మొత్తం 250 మార్కులు ఉంటాయి. ఈ పేపర్‌లో మూడు విభాగాలు(సర్జరీ, గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్) నుంచి 40 చొప్పున మొత్తం 120 ప్రశ్నలడుగుతారు. సర్జరీ విభాగంలో.. జనరల్ సర్జరీ (గాయాలు, ట్యూమర్లు, ఇన్ఫెక్షన్స్, ఎలిమెంటరీ ట్రాక్, అబ్డామినల్ ఇన్‌జ్యూరీస్, న్యూరో సర్జరీ తదితర)పై ప్రశ్నలుంటాయి. గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్ నుంచి ఇంట్రా -నాటల్, పోస్ట్-నాటల్; అపై ్లడ్ అనాటమీ, అపై ్లడ్ సైకాలజీ, జెనిటల్ ట్రాక్; నియోప్లాస్మా; గర్భ నిరోధక విధానాలు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. చివరి విభాగ మైన ప్రివెంటివ్ సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌లో.. సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్ ఉద్దేశం- విధానం; హెల్త్ అడ్మినిస్ట్రేషన్; భారత దేశంలోని విభిన్న జాతులు- వాటికి సంబంధించిన ఆరోగ్య గణాంకాలు, న్యూట్రిషన్ అండ్ హెల్త్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సోషియాలజీ సంబంధ ప్రశ్నలడుగుతారు.
సీఎంఎస్ రాత పరీక్షలో పేపర్-1 ఏవిధంగా ఉంటుంది?
+
సీఎంఎస్ పేపర్-1లో ఏ, బీ, సీ, అనే మూడు విభాగాల్లో ప్రశ్నలడుగుతారు. ఏ (జనరల్ ఎబిలిటీ)లో 30, బీ (జనరల్ మెడి సిన్)లో 70, సీ (పిడియాట్రిక్స్)లో 20 మొత్తం 120 ప్రశ్న లుంటాయి. జనరల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు భారత చరిత్ర, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సహజ వనరులు, జాగ్రఫీ, ప్రజారోగ్యం, ప్రకతి వైపరీత్యాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో తాజా పరిణామాలు తదితర సమకాలీన అంశాల నుంచే ఉంటాయి. పార్ట్-బిలో జనరల్ మెడిసిన్ సంబంధ ప్రశ్నలు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా కార్డియాలజీ, న్యూరాలజీ, డెర్మటాలజీ, సైకియాట్రీ, వైరస్‌లు, వివిధ ఫంగస్‌లు, బ్యాక్టీరియాలు, న్యూట్రిషన్ అండ్ గ్రోత్, హెమటాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, తదితర అంశాల నుంచి ప్రశ్నలడుగు తారు. పార్ట్-సి పిడియాట్రిక్స్‌లో చిన్న పిల్లల ఆరోగ్య సమస్యలు, నివారణ, వైద్య విధానానికి చెందిన ప్రశ్నలుంటాయి.
సీఎంఎస్ రాత పరీక్ష ప్యాట్రన్‌ను వివరించండి?
+
రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల్లోని జనరల్ నాలెడ్జ్‌ను.. అదే విధంగా మెడికల్ నాలెడ్జ్‌ను పరీక్షిస్తారు. ఈ క్రమంలో మొత్తం రెండు పేపర్లుగా 500 మార్కులకు నిర్వహించే పరీక్షలో మొదటి పేపర్‌లో జనరల్ ఎబిలిటీకి సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారు. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం.
సీఎంఎస్ ఎంపిక ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది?
+
కంైబైన్డ్ మెడికల్ సర్వీసెస్(సీఎంఎస్) ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. అవి.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ. ప్రతిపాదిత ఖాళీలకు 1:2 చొప్పున రాత పరీక్ష నుంచి అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. మొత్తం 500 మార్కులకు నిర్వహించే రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. అంతేకాక 0.33 శాతం నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. రాత పరీక్షను దేశ వ్యాప్తంగా పలు కేంద్రాల్లో నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిలలో ఈ పరీక్ష రాయొచ్చు.
సీఎంఎస్ అర్హతలేమిటి?
+
ఎంబీబీఎస్ ఉత్తీర్ణులు, చివరి సంవత్సరం చదువుతున్న వారు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే చివరి సంవత్సరం చదువుతున్న వారు ఇంటర్వ్యూ సమయానికి సర్టిఫికెట్ అందించడం తప్పనిసరి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతూ ‘కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్’లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సీఎంఎస్ తుది జాబితా ఎంపిక సమయానికి ఆ ఇంటర్న్ షిప్‌ను పూర్తి చేసుకుంటేనే అపాయింట్‌మెంట్ లభిస్తుంది.
సీఎంఎస్ ద్వారా ఉద్యోగంలోకి ప్రవేశిస్తే కెరీర్ ఏవిధంగా ప్రారంభమవుతుంది?పే స్కేల్ ఎలా ఉంటుంది?
+
సీఎంఎస్ ద్వారా ఎంపికైన వారు సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో జూనియర్ స్కేల్ పోస్ట్ నియామకం ద్వారా.. సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీం, ఇతర కేంద్ర ప్రభుత్వ వైద్య పథకాల పరిధిలోని వైద్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్ హోదాలో అడుగుపెట్టవచ్చు. రైల్వే విభాగానికి ఎంపికైన వారు రైల్వే హాస్పిటల్స్‌లో సేవలందించాలి. ఇలా నోటిఫికేషన్లో పేర్కొన్న శాఖల పరిధిలో జూనియర్ స్కేల్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. నిర్దేశిత సమయం ప్రొబేషనరీగా పరిగణిస్తారు. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్‌కు ఎంపికైన అభ్యర్థులు.. తాము ప్రైవేట్ ప్రాక్టీస్ నిర్వహించబోమని లిఖితపూర్వక అగ్రిమెంట్ రాయాలి. ఎంపికైన వారికి ఈ నిబంధన నిరుత్సాహం కలిగించకూడదనే ఉద్దేశంతో.. బేసిక్ పేకు అదనంగా 25 శాతం మొత్తాన్ని నాన్ ప్రాక్టీసింగ్ అలవెన్స్ కూడా మంజూరు చేస్తున్నారు.
యూపీఎస్సీ నిర్వహించే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వివరాలు తెలపండి?
+
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ).. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పలు శాఖలు, విభాగాల్లో వైద్యుల నియామకానికి నిర్వహించే పరీక్షే కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(సీఎంఎస్). యూపీఎస్సీ ఈ పరీక్షను ఏటా నిర్వహిస్తోంది. దీని ద్వారా రైల్వే, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, సెంట్రల్ హెల్త్ సర్వీసెస్, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్.. తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేస్తారు.