Skip to main content

నేను బీకాం చదువుతున్నాను. దీని తర్వాత ఏ కోర్సు చదివితే కెరీర్ బాగుంటుందో వివరించండి?

- శ్యాంరెడ్డి, ఖమ్మం.
Question
నేను బీకాం చదువుతున్నాను. దీని తర్వాత ఏ కోర్సు చదివితే కెరీర్ బాగుంటుందో వివరించండి?
చార్టర్‌‌డ అకౌంటెన్సీ: ఈ కోర్సులో ఆడిట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శిక్షణ ఇస్తారు. వృత్తిపరమైన నైపుణ్యాలు అందిస్తారు. స్టడీ మెటీరియల్ మొత్తం బోర్డ్ ఆఫ్ స్టడీస్ అందిస్తోంది. గుర్తింపు పొందిన సంస్థల నుంచి కోచింగ్ తీసుకోవచ్చు.
వెబ్‌సైట్: www.icai.org.in

కంపెనీ సెక్రటరీ: ఇందులో మూడు దశలు.. ఫౌండేషన్, ఇంటర్మీడియెట్, ఫైనల్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఆప్షనల్ ఓరల్ క్లాసుల ద్వారా కరస్పాండెన్స్‌లో ఈ కోర్సు పూర్తిచేయవచ్చు.
వెబ్‌సైట్: www.icsi.edu

ఎంకాం: ఇందులో కామర్స్‌పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బీకాం అర్హతతో ఉస్మానియా, కాకతీయ, ఆంధ్రా, శ్రీ వేంకటేశ్వరా, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తదితర విశ్వవిద్యాలయాలు ఈ కోర్సును అందిస్తున్నాయి.
ఎంబీఏ: ఇందులో రకరకాల స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవాటిని ఎంపిక చేసుకొని, లక్ష్యం దిశగా సాగవచ్చు.

Photo Stories