బీకాం తర్వాత ఏ కోర్సులు చేస్తే కెరీర్ బాగుంటుంది. ఆ కోర్సుల వివరాలు తెలపండి ?
రమ్య, చిత్తూరు.
Question
బీకాం తర్వాత ఏ కోర్సులు చేస్తే కెరీర్ బాగుంటుంది. ఆ కోర్సుల వివరాలు తెలపండి ?
బీకాం తర్వాత కొన్ని కోర్సులు చదివితే మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఏ ఉద్యోగానికైనా కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. వర్డ్, ఎక్స్‌ఎల్, పవర్ పాయింట్‌లను తప్పనిసరిగా నేర్చుకోవాలి. పనిలో భాగంగా వీటిని ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు ఈ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నాయి. అదనంగా అడ్వాన్స్‌డ్ లెవల్ కోర్సులు ఒరాకిల్, శాప్, టాలీ అండ్ ఫోకస్, హెచ్‌టీఎంల్, జావా లాంగ్వేజ్‌లను నేర్చుకుంటే కెరీర్ ఎదుగుదల బాగుంటుంది.
ఫైనాన్షియల్ మార్కెట్: స్టాక్ మార్కెట్‌లో ఆసక్తి ఉంటే ఈ కోర్సులను చదవొచ్చు.
ఫైనాన్షియల్ మార్కెట్: స్టాక్ మార్కెట్‌లో ఆసక్తి ఉంటే ఈ కోర్సులను చదవొచ్చు.
- త్రిపురలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్స్ ఆఫ్ ఇండియా.. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్సు అందిస్తోంది.
వెబ్‌సైట్: www.icfaiuniversity.in
- నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంచ్ (బీఎస్‌ఈ)లు కూడా వివిధ కోర్సులను అందిస్తున్నాయి.
వెబ్‌సైట్: www.nseindia.com www.bseindia.com