Skip to main content

CA, ICWA, CS

నేను ప్రస్తుతం చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు చదువుతున్నాను. నేను సీఏ కెరీర్‌లో రాణించాలంటే ఎలాంటి సాఫ్ట్‌వేర్ కోర్సు లపై అవగాహన ఉండాలో తెలపండి?
+
చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సు పూర్తయ్యాక కార్పొరేట్ కంపెనీల్లో అడుగుపెట్టే అభ్యర్థులకు ట్యాలీ, ఎక్స్‌ఎల్, ఎస్‌ఏపీ (శ్యాప్), ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌పై అవగాహన ఉండటం తప్పనిసరి. అదేవిధంగా సీఏలకు ఎంఎస్ ఆఫీస్‌పై పట్టు ఉండాలి. దాంతోపాటు ఎంఎస్ ఎక్స్‌ఎల్ ఆడిట్ వర్క్‌లో ఉపయోగ పడుతుంది. ఎంఎస్ వర్డ్ ఆడిట్ నివేదికలు తయారుచేయడంలో దోహదపడుతుంది. ఎం ఎస్ పవర్ పాయింట్... కార్పొరేట్ కంపెనీల సమావేశాల్లో ఏదైనా అంశంపై ప్రజంటేషన్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. అలాగే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ నిర్వహణకు ట్యాలీ, ఒరా కిల్ తప్పనిసరి. ముఖ్యంగా ట్యాలీ దేశంలో ప్రస్తుతం చిన్న, మధ్యతరహా కంపెనీల్లో అకౌం టింగ్, రిపోర్టింగ్‌లో బాగా పాపులర్ సాఫ్ట్‌వేర్ కోర్సు. వీటితోపాటు టీడీఎస్, జీఎస్‌టీ, ఇన్‌క మ్ ట్యాక్స్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌లపైనా అవగాహన పెంచుకోవడం అవసరం.
ఇంటర్‌ (మ్యాథ్స్‌ గ్రూప్‌)తో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. సీఏ చేయాలనుకుంటున్నాను. దీంతోపాటు మ్యాథ్స్‌ బ్యాగ్రౌండ్‌తో చేయదగిన కోర్సులను తెలపండి?
+
మొదట మీరు కెరీర్‌గా ఏ రంగాన్ని ఎంచుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. దాని తగిన బ్యాచిలర్స్‌, పీజీ కోర్సులను ఎంపిక చేసుకోండి. మ్యాథ్స్‌ బ్యాగ్రౌండ్‌తో సైన్స్‌, కామర్స్‌లలో చాలా కోర్సులు చేయవచ్చు. వాటిలోసీఏ, ఐసీ డబ్ల్యూఏ, సీఎస్‌ ముఖ్యమైనవి.
ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంట్స్‌ ఆఫ్‌ ఇండియా చార్టర్డ్‌ అకౌంటెన్సీ(సీఏ)కి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తుంది. చార్డర్డ్‌ అకౌంటెన్సీ కోర్సు మూడు దశలుగా ఉంటుంది.
మొదటి దశలో కామన్‌ ఫ్రొఫిసియెన్సీ టెస్ట్‌(సీపీటీ)కు హజరు కావాల్సి ఉంటుంది. ఇంటర్‌ పూర్తి చేసిన వారు దీనికి అర్హులు. అయితే 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇందుకోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఇంటర్‌ పూర్తయిన తర్వాత హాజరు కావాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్‌/మెడికల్‌/తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్‌ మాదిరిగానే పరీక్ష విధా నం ఉంటుంది.
రెండో దశ: ది ప్రొఫెషనల్‌ కాంపిటెన్సీ కోర్సు. ఇందులో అభ్యర్థి కోర్సుతోపాటు గుర్తింపు పొందిన సీఏ దగ్గర మూడున్నరేళ్ల పాటు శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. మూడు నెలల తర్వాత ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో 100గంటల పాటు శిక్షణ పొందాలి. ప్రొఫెషనల్‌ కాంపిటెన్సీ ఎగ్జామినేషన్‌తో ఈ కోర్సు ముగుస్తుం ది. చివరి దశ కోర్సులో ఫైనాన్షియల్‌ రిపోర్టింగ్‌, ఆడిటింగ్‌, టాక్సేషన్‌, కార్పొరేట్‌ లా, సిస్టమ్‌ కంట్రోల్‌, స్ట్రాటజిక్‌ ఫైనాన్స్‌, అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీకి సంబంధించిన అంశాలుంటాయి. వెబ్‌సైట్‌: https://icai.org
కోర్సు పూర్తయిన తర్వాత ఆడిటర్లు, కన్సల్టెంట్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా అవకాశాలుంటాయి.
ఇతర కోర్సులు: ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ అందిస్తోన్న సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ ప్లానర్‌ కోర్సు చేయవచ్చు. వెబ్‌సైట్‌: www.fpsb.org
ఉస్మానియా వర్సిటీ ఆఫర్‌ చే సే ఎంబీఏ, మాస్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ కంట్రోల్‌ (వెబ్‌సైట్‌: www.osmania.ac.in), ఆంధ్రా వర్సిటీ (వెబ్‌సైట్‌: www.andhrauniversity.info) అందిస్తోన్న ఎం సీఏ, వివిధ విభాగాల్లో ఎంఎస్సీ కోర్సులను కూడా చేయవచ్చు.
మాద్రాస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ (అన్నా వర్సిటీ-వెబ్‌సైట్‌: www.msea.ac.in), ఆఫర్‌ చేసే ఎంఎస్సీ (ఫైనాన్షియల్‌ ఎక నామిక్స్‌), భారతీయార్‌ వర్సిటీ (వెబ్‌సైట్‌: www.bu.ac.in) అందిస్తోన్న ఎంఎస్సీ (ఎకనోమెట్రిక్స్‌, మ్యాథ్స్‌, మ్యాథమెటిక్స్‌తో కంప్యూటర్‌ సైన్స్‌, స్టాటిస్టిక్స్‌తో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌) కోర్సులను చేయవచ్చు.
కంపెనీ సెక్రటరీ కోర్సు చదవాలనుకుంటున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవకాశాలెలా ఉంటాయి? దీంతోపాటు అదనంగా చేయాల్సిన కోర్సులను తెలపండి?
+
భారతీయ కార్పొరేట్‌ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో కార్పొరేట్‌ కార్యకలపాలను నిర్వహించేందుకు అవసరమయ్యే ప్రొఫెషనల్స్‌ సంఖ్య కూడా పెరుగుతోంది. అటువంటి కార్యకలాపాలను నిర్వహించే వ్యక్తి కంపెనీ సెక్రటరీ. ప్రభుత్వ, ప్రైవేట్‌, కంపెనీల్లో అడ్మినిస్ట్రేటివ్‌, లీగల్‌, ఫైనాన్స్‌, అకౌంట్స్‌ వంటి విభాగాల్లో కంపెనీ సెక్రటరీలకు అవకాశాలుంటాయి. కంపెనీ లా, సైబర్‌లా అం శాల్లో డిగ్రీ, ఎంబీఏ వంటి అదనపు డిగ్రీలు మీ అవకాశాలను మరింత పెంచుతాయి. ఈ రోజుల్లో ప్రతి కంపెనీ కంపెనీ సెక్రటరీలను నియమించుకుంటోంది. దీంతో కంపెనీ సెక్రటరీ కోర్సు చేసిన వారికి అవకాశాలు బాగా పెరిగాయి. అకౌంట్స్‌, ఫైనాన్స్‌, లీగల్‌, హ్యూమన్‌ రీసో ర్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ విభాగాలకు సహాయపడడంతోపాటు డెరైక్టర్లకు కంపెనీ అవసరాల గురించి సీఎస్‌ తగిన సలహాలు ఇస్తాడు. లా, మేనేజ్‌మెంట్‌,ఫైనాన్స్‌ వంటి అంశాల్లో వీరు శిక్షణ పొందడంతో కంపెనీలు తీసుకునే కీలక నిర్ణ యాల్లోను ప్రధానపాత్ర పోషిస్తారు. రికార్డులను నిర్వహించడం, మీటింగ్‌లను ఏర్పాటు చేయడం, ట్యాక్స్‌, లోన్స్‌, పెట్టుబడి, విలీనాలు, విస్తరణ సంబంధిత వ్యవహారాలను కంపెనీ సెక్రటరీలు నిర్వహిస్తుంటారు. డెరైక్టర్లకు షేర్‌హోల్డర్లకు మధ్య వారధిగా వీరు ఉంటారు. కంపెనీ సంబంధిత విషయాల్లో ముఖ్యంగా కంపెనీ చట్టాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంటే ఈ కెరీర్‌ లో ఉన్నత స్థానాలకు ఎదగొచ్చు.
నేను ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌ పూర్తిచేశాను. చార్టర్డ్‌ అకౌంటెన్సీ కోర్సు చదవాలనుంది. దీనికి సంబంధించి వివరాలు తెలియజేయగలరు?
+
 అకౌంటింగ్‌, ఆడిటింగ్‌, ట్యాక్సేషన్‌ విధానాలపై పూర్తి అవగాహన కల్పించే కోర్సు సి.ఎ. ఈ కోర్సు పూర్తి చేసుకున్న ప్రొఫెషనల్స్‌ వ్యక్తుల నుంచి సంస్థల వరకు అకౌంటింగ్‌ మెుదలు వ్యాపార సలహాల వరకు అనేక విధాల తోడ్పడ తారు. దేశంలో అకౌంటెన్సీ వృత్తిని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియూ పర్యవేక్షిస్తుంది. వారు పేర్కొన్న నిర్ణీత అర్హతలు సాధిస్తే మంచి అవకాశాలు లభి స్తారుు. సి.ఎ. కోర్సు మూడు దశల్లో ఉంటుంది. మెుదటి దశ కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌. పదో తరగతి పూర్తయ్యూక దీనికోసం పేరు నమోదు చేసుకుని ఇంటర్మీడియెట్‌ సర్టిఫి కెట్‌ పొందాక సి.పి.టి. పరీక్షకు హాజరు కావచ్చు. ఆ పరీక్ష లో ఉత్తీర్ణత ఆధారంగా ఐపీసీసీ మెుదటి దశ పరీక్ష కోసం పేరు నమోదు చేసుకోవాలి. మెుదటి దశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి రెండో దశలో అడుగు పెట్టవచ్చు. ఈ సమయంలోనే మూడేళ్ల ఆర్టికల్‌షిప్‌ కోసం పేరు నమోదు చేసుకోవాలి. ఐపీసీసీ రెండో దశ కూడా పూర్తయ్యూక ఐపీసీసీ ఫైనల్‌ (న్యూ) కోర్సులో చేరాల్సి ఉంటుంది. ఆర్టికల్‌షిప్‌ మరో ఆరు నెలల్లో ముగుస్తుందనగా ఈ ఫైనల్‌(న్యూ) పరీక్షల్లో హాజరయ్యేందుకు అవకాశం లభిస్తుంది. పూర్తి వివరాలకు www.icai.org వెబ్‌సైట్‌ చూడండి.
నేను ప్రస్తుతం బీఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌) రెండో సంవత్సరం చదువుతున్నాను. నాకు ఎంబీయే చదవాలని కోరిక. అరుుతే ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఎంబీయేకు బదులు కంపెనీ సెక్రటరీ కోర్స్‌ చదవాలని నిర్ణరుుంచుకున్నాను. నా నిర్ణయం సరైనదేనా?
+
మీ తాజా నిర్ణయం సరైనదే. ఎంతో విలువైనది. చిన్న తరహా నుంచి భారీ సంస్థల వరకు కంపెనీ లా బోర్డ్‌ నిర్దేశించిన విధివిధానాలను కచ్చితంగా పాటించాల్సిందే. అటువంటి న్యాయపరమైన అంశాలను కేవలం అర్హత సాధించిన కంపెనీ సెక్రటరీలు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందువల్ల అవకాశాల విషయంలో ఆందోళన అనవసరం. కంపెనీ సెక్రటరీ కోర్స్‌తోపాటు ‘లా’ కోర్స్‌ చదవడం కూడా ఎంతో ఉపకరిస్తుంది. ప్రస్తుతం చాలా మంది సి.ఎస్‌.లు అనుసరిస్తున్న విధానం కూడా. ఇప్పుడు పలు ఇన్‌స్టిట్యూట్‌లు బ్యాచిలర్‌ ఆఫ్‌ జనరల్‌ లా కోర్సును అందిస్తున్నారుు.
కంపెనీ సెక్రటరీ కావాలన్నది నా ఆశయం. ఈ కోర్సు గురించి వివరించగలరు?
+
కంపెనీ సెక్రటరీ వృత్తి కార్పొరేట్‌, ఫైనాన్స్‌, లీగల్‌ లావా దేవీలతో ముడిపడి ఉంటుంది. వీటికి సంబంధించి సేల్స్‌టాక్స్‌, కంపెనీ, సెక్యూరిటీస్‌, కార్పొరేట్‌ లా, ఫైనాన్స్‌, అకౌంట్స్‌, పర్సనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ వ్యవహారాలు నిర్వహించాలి. కంపెనీ సెక్రటరీలు కంపెనీ బోర్డు ఆఫ్‌ డెరైక్టర్లు, షేర్‌ హోల్డర్లు, ప్రభుత్వం, రెగ్యులేటరీ అథారిటీస్‌ మధ్య సంధానకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది. ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియూ పరీక్ష నిర్వహిస్తుంది. శిక్షణ అనంతరం అర్హులైన అభ్యర్థులను మెంబర్లుగా తీసుకొని వృత్తి పరమైన విలువలు, ప్రవర్తన నియమావళిపై అవగాహన కల్పిస్తారు. సమకాలీన మార్పులకు అనుగుణంగా మెంబర్లకు వృత్తిమెలకు వలు నేర్పించేందుకు ఐసీఎస్‌ఐ రెగ్యులర్‌గా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది.
కోర్సు విధానం :
కంపెనీ సెక్రటరీ కోర్సులో ఫౌండేషన్‌, ఇంటర్మీడియెట్‌, ఫైనల్‌ అనే మూడు దశలు ఉంటారుు. ఫౌండేషన్‌ కోర్సు చేయడానికి ఇంటర్మీడియెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్మీడియెట్‌ కోర్సుకు ఫౌండేషన్‌ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఫైన్‌ ఆర్ట్స్‌ కాకుండా ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చేసిన అభ్యర్థులు అర్హులు. ఫైనల్‌ కోర్సు కోసం ఇంటర్మీడియెట్‌ కోర్సు పూర్తిచేసి ఉండాలి. ఇంటర్‌/ ఫైనల్‌ కోర్సు ఉత్తీర్ణత తర్వాత అభ్యర్థులు తప్పని సరిగా 16 నెలల మేనేజ్‌మెంట్‌ ట్రైనింగ్‌ పూర్తి చేయూల్సి ఉంటుంది. దేశంలో గుర్తింపు పొందిన సంస్థల నుంచి సీఎస్‌లో భాగమైన మూడు దశల కోర్సులను చేయడానికి అవకాశం ఉంది. సీఎస్‌ పూర్తి చేసిన అభ్యర్థులు సంబంధిత అంశంలో పీహెచ్‌డీ చేయడానికి వీలుంటుంది. వెబ్‌సైట్‌ : www.icsi.edu
బీకాం తృతీయ సంవత్సరం చదువుతున్నాను. ఐసీడబ్ల్యూఏ కోర్సు చేయాలనుకుంటున్నాను. ఈ కోర్సు గురించి వివరించండి. అలాగే ప్రారంభ వేతనం ఎంత లభించగలదు?
+
‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా’ (ఐసీడబ్ల్యూఏఐ) దేశంలో కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ నిపుణులను తయారు చేసే క్రమంలో అభ్యర్థులకు శిక్షణ ఇచ్చే ఉద్దేశంతో పని చేస్తోంది.
ఇంటర్మీడియెట్‌, ఫైనల్‌ అనే రెండు విభాగాలుగా ఐసీ డబ్ల్యూఏ కోర్సును నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ఎనిమిది పేపర్లు ఉంటాయి. ఒక్కో విభాగం నాలుగేసి పేపర్లతో రెండు దశలుగా కోర్సు ఉంటుంది. కొత్త సిలబస్‌ అనుసరించి ఇంటర్మీడియెట్‌ విభాగంలో 8 పేపర్ల తోపాటు రెండు గ్రూప్‌ డిస్కషన్స్‌, రెండు సెమినార్లు, 50 గంటల కంప్యూటర్‌ శిక్షణ ఉంటుంది. ఇంటర్మీడియె ట్‌ పూర్తి చేస్తే ఫైనల్‌లోకి వెళ్లడానికి అవకాశం లభిస్తుంది.
ఫైనల్లో ఎనిమిది పేపర్లతో పాటు 5,000 పదాల వ్యాసం, 100 గంటల కంప్యూటర్‌ శిక్షణ, 15 రోజులు మాడ్యులర్‌ శిక్షణ, ఆరు మాసాల ఆడిట్‌ అండ్‌ ఇండ స్ట్రియల్‌ ట్రైనింగ్‌ పూర్తి చేయాలి.
ఐసీడబ్ల్యూఏ ఇంటర్మీడియెట్‌ కోర్సులో ప్రవేశానికి 10+2 పూర్తి చేసిన అభ్యర్థులు మొదట ఫౌండేషన్‌ కోర్సులో చేరాల్సి ఉంటుంది.
అర్హత : ఫౌండేషన్‌ కోర్సు పూర్తి చేసిన 10+2 అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ కోర్సులో చేరవచ్చు. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ చదివిన అభ్యర్థులు ఫౌండేషన్‌ కోర్సులో చేరాల్సిన అవసరం లేదు.
దరఖాస్తు వెల : రూ.200
పోస్టల్‌ ట్యూషన్‌ ఫీజు(స్టడీ మెటీరియల్‌తో): రూ.7,000
మౌఖిక శిక్షణ ఫీజు (స్టడీ మెటీరియల్‌తో) : రూ.11,000
పరీక్ష : ఏడాదిలో రెండు సార్లు జూన్‌, డిసెంబర్‌ నెలలో పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్‌సైట్‌: www.icwai.org/icwai/academicadmission.asp
హైదరాబాద్‌ చాప్టర్‌ ఈ-మెయిల్‌ ఐడీ : hyderabad@icwai.org
ఐసీడబ్ల్యూఏ కోర్సు చేస్తే.. మేనేజింగ్‌ డెరైక్టర్‌, ఫైనాన్స్‌ డెరైక్టర్‌, ఫైనాన్షియల్‌ కంట్రోలర్‌, చీఫ్‌ అకౌంటెంట్‌, కాస్ట్‌ కంట్రోలర్‌, మార్కెటింగ్‌ మేనేజర్‌, చీఫ్‌ ఇంటర్నల్‌ ఆడిటర్‌ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా ఉంటాయి. సొంత వ్యాపారాలు నిర్వహించవచ్చు. అర్హత, శిక్షణ నైపుణ్యం, అనుభవం గల కాస్ట్‌ అకౌంటెంట్లకు ఎంతో డిమాండ్‌ ఉంది. వీరికి అవకాశం కల్పించేందుకు ఎన్నో సంస్థలు ఎదురు చూస్తున్నాయి. అకౌంటెన్సీ నిపుణులను రూపొందించే పనిలో ఉన్న మరెన్నో విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలు వీరికి పెద్ద మొత్తాల్లో జీతాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇంటర్మీడియెట్‌ చదువుతున్నాను. తర్వాత బీకామ్‌, సీఏ ఒకే సారి చేసే అవకాశం ఉందా?
+
బీకామ్‌, సీఏ కోర్సు ఒకేసారి చేసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం.. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ మాదిరిగా సీఏ కూడా ఒక ప్రొఫెషనల్‌ కోర్సు. అకౌంటింగ్‌, ఆడిటింగ్‌కు సంబంధించి అభ్యర్థికి పూర్తి స్థాయి అవగాహన కల్పించే విధంగా ప్రాక్టికల్‌ వర్క్‌తో కూడిన విధంగా కోర్సు కూర్పు ఉంటుంది.కాబట్టి రోజుకు 12-14 గంటల పాటు కష్టపడితేనే ఈ కోర్సులో గట్టెక్కవచ్చు. ఇదే సమయంలో మరొక కోర్సు కోసం సమయం కేటాయించడం చాలా కష్టం. ఎందుకంటే ఈ కోర్సును నిర్వహించే ‘ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ)’ ఉత్తీర్ణత విషయంలో కఠిన నిబంధనలను పాటిస్తుంది. కొంత మంది మాత్రమే వీటిని తట్టుకుని గట్టెక్కుతారు. సీఏకు సమాంతరంగా మరొక కోర్సుకు సమయం కేటాయిస్తే ఇందులో ఉత్తీర్ణులు కావడం కష్టం. కాబట్టి సీఏ కోర్సు మీదే ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం మంచిది.
చార్టెడ్‌ అకౌంటెంట్‌ కోర్సు వివరాలను తెలపండి?
+
అ ఒక కంపెనీ లేదా వ్యక్తికి సంబంధించిన అకౌంటింగ్‌, ఆడిటింగ్‌, ట్యాక్సేషన్‌ వంటి వ్యవహారాలను చార్టెడ్‌ అకౌంటెంట్‌ పర్యవేక్షిస్తాడు. చార్టెడ్‌ అకౌంటెంట్‌ కోర్సులో మొత్తం మూడు దశలుంటాయి. అవి.. 1) కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (సీపీటీ); 2) ప్రొఫెషనల్‌ కాంపిటె న్స్‌ కోర్సు (పీసీసీ); 3) ఫైనల్‌ కోర్సు.
సీఏ కోర్సు చేయాలనుకున్న విద్యార్థులు ముందుగా కామన్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ రాయాలి. ఇందుకోసం పదో తరగతి పూర్తికాగానే పేరు నమోదు చేసుకోవాలి. ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు పూర్తయ్యాక సీపీటీ రాయడానికి అర్హత లభిస్తుంది. ఈ పరీక్ష ప్రతిఏటా జూన్‌, డిసెంబర్‌లలో రెండుసార్లు జరుగుతుంది. మొత్తం రెండు విభాగాలుగా.. నాలుగు సబ్జెక్టుల్లో 200 మార్కులకు సీపీటీ నిర్వహిస్తారు. మొదటి విభాగంలో సెక్షన్‌-ఎ-ఫండమెంటల్స్‌ ఆఫ్‌ అకౌంటింగ్‌ (60 మార్కులు), సెక్షన్‌-బి-మర్కంటైల్‌ లా(40 మార్కులు); రెండో విభాగంలో సెక్షన్‌-సి-జనరల్‌ ఎకనామిక్స్‌(50 మార్కులు), సెక్షన్‌-డి-క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 మార్కులు). ఈ పరీక్ష పాసైన వారు ప్రొఫెషనల్‌ కాంపిటెన్సీ కోర్సు(పీసీసీ)కు పేరు నమోదు చేసుకోవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఆడిటర్స్‌, కన్సల్టెంట్స్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్స్‌గా అవకాశాలుంటాయి. వెబ్‌సైట్‌: www.icai.org
బీకామ్‌ (కంప్యూటర్స్‌) పూర్తి చేశాను. సీఏ చేయాలనుకుంటున్నా. భవిష్యత్తులో అవకాశాలు ఎలా ఉంటాయి. ఫీజు వివరాలు తెలపండి?
+
 పబ్లిక్‌, ప్రైవేట్‌ రంగాల్లో మంచి అవకాశాలు అందించే కోర్సు సీఏ. ఫైనాన్సియల్‌, బ్యాంకింగ్‌, ఇన్సూరెన్స్‌ రంగాల్లో సీఏ నిపుణుల అవసరం నేడు ఎంతో ఉంది. అలాగే యూపీఎస్‌సీ నిర్వహించే పోటీ పరీక్షలకు కూడా హాజరు కావచ్చు. ఆర్థిక రంగం రోజురోజుకూ విస్తృతమవుతున్న నేపథ్యంలో అకౌంటింగ్‌, ఆడిటింగ్‌ నిపుణులకు అనేక కొత్త అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. సీఏ పూర్తి చేసిన అభ్యర్థులు ఫైనాన్స్‌ మేనేజర్లు, ఫైనాన్షియల్‌ కంట్రోలర్లు, ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు, డెరైక్టర్లు (ఫైనాన్స్‌)గా మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో రోజువారీ ఆర్థికపరమైన అంశాలను నిర్వహించాల్సి ఉంటుం ది. వీరు ప్రధానంగా అకౌంటెన్సీ, ఆడిటింగ్‌, కాస్ట్‌ అకౌంటెన్సీ, టాక్సేషన్‌, ఇన్వెస్టిగేషన్‌, కన్సల్టెన్సీ వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటారు. కొంతమంది సీఏ నిపుణులు వారి ఆసక్తిని బట్టి క్యాపిటల్‌ మార్కెట్స్‌, వాణిజ్య కంపెనీ/ పరిశ్రమల్లో అవకాశాలు పొందవచ్చు. సొంతగా కన్సల్టెన్సీ, ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ కూడా చేసుకోవచ్చు. రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, రిస్క్‌ అనాలసిస్‌కు మంచి భవిష్యత్తు ఉంది. అలాగే ఎక్కడైనా ఉపాధి లభించడానికి టాక్సేషన్‌ కూడా ఉపయోగపడుతుంది. సీఏ చేయడానికి ఖర్చు కూడా స్వల్పంగానే ఉంటుంది. ఆర్టికల్‌షిప్‌ చేయడం ద్వారా స్టైఫండ్‌ పొందుతూ సీఏ చేయడానికి అవకాశం ఉంది. పూర్తి వివరాలకు www.icai.org.
ఐసీడబ్ల్యూఏఐ కోర్సుకు సంబంధించిన వివరాలను తెలపండి?
+
కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ వ్యవహారాలను సమర్థంగా సమీక్షించడం, ఆ రంగంలో నిపుణులను రూపు దిద్దే ఉద్దేశంతో.. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అండ్‌ వర్క్స్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీడబ్ల్యూఏఐ) ఏర్పాటైంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ అందించే కోర్సే కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీ. అర్హత: ఇంటర్మీడియెట్‌. ప్రస్తుతం ఐసీడబ్ల్యూఏఐలో మూడు దశల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి ఫౌండేషన్‌, ఇంటర్మీడియెట్‌, ఫైనల్‌. ఈ దశల్ని పూర్తి చేసుకున్న విద్యార్థులకు అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ లభిస్తుంది.

ఐసీడబ్ల్యూఏఐ.. ఏ దశలో ప్రవేశించాలన్నా.. నిర్దేశిత ఐసీడబ్ల్యూఏఐ రీజనల్‌ కేంద్రాలు లేదా చాప్టర్లలో దరఖాస్తు చేసుకోవాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఏటా రెండుసార్లు జరిగే పరీక్షలకు హాజరవ్వాలంటే.. పరీక్ష జరిగే తేదీకి కనీసం ఆరు నెలల ముందు దరఖాస్తు చేసుకోవాలి. ఐసీడబ్ల్యూఏఐ కోర్సులో నిర్ణీత రుసుం చెల్లించి ఏ దశకైనా నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ఖరారైన విద్యార్థులు.. ఇన్‌స్టిట్యూట్‌ అందిస్తున్న పోస్టల్‌ లేదా ఓరల్‌ కోచింగ్‌లలో ఏదో ఒక దానిని ఎంచుకోవాలి. ఇంటర్మీడియెట్‌ విద్యార్థులు అదనంగా.. వంద గంటల కంప్యూటర్‌ ట్రైనింగ్‌కు హాజరవ్వాలి. దీనికోసం కొంత ఫీజు చెల్లించాలి. మన రాష్ట్రంలో ఓరల్‌ కోచింగ్‌, కంప్యూటర్‌ ట్రైనింగ్‌ సదుపాయం హైదరాబాద్‌ చాప్టర్‌లో అందుబాటులో ఉంది.

హైదరాబాద్‌ చాప్టర్‌ చిరునావూ:
ఐసీడబ్ల్యూఏఐ భవన్‌, 1-2-56/44/A,
స్ట్రీట్‌ నెం.5, హివూయుత్‌నగర్‌,
హైదరాబాద్‌-029.
ఈమెరుుల్‌: hyderabad@icwai.org
వెబ్‌సైట్‌: www.icwai.org
పీజీ డిప్లొమా ఇన్‌ అకౌంటింగ్‌ అండ్‌ టాక్సేషన్‌ కోర్సును అందిస్తోన్న సంస్థలేవి?
+
మన రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ టాక్సేషన్‌ కోర్సును అందిస్తోంది.
అర్హత: బీకాం. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.osmaina.ac.in
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ -సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఘజియాబాద్‌ ఏడాది వ్యవధి గల పీజీ డిప్లొమా ఇన్‌ టాక్సేషన్‌ కోర్సును దూర విద్య విధానంలో అందిస్తోంది.
వివరాలకు: www.imtcdl.ac.in
అన్నామలై యూనివర్సిటీ-డెరైక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, తమిళనాడు పీజీ డిప్లొమా ఇన్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కోర్సును డిస్టెన్స్‌లో ఆఫర్‌ చేస్తోంది.
https://annamalaiuniversity.ac.in