Arts
బోధనావకాశాలు..
- టీచింగ్‌పై ఆసక్తి ఉన్న బీఏ గ్రాడ్యుయేట్లు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) వైపు అడుగులు వేయొచ్చు. బీఈడీ అనంతరం డీఎస్సీలో ప్రతిభతో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించొచ్చు. ప్రస్తుతం ఉపాధ్యాయులకు వేతనాలు బాగానే ఉన్నాయి.
- ఎంఏ (హిస్టరీ) పూర్తిచేసిన అభ్యర్థులు యూజీసీ.. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్), స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)లో అర్హత సాధించడం ద్వారా లెక్చరర్ కొలువులను అందుకోవచ్చు. నెట్‌లో ప్రతిభకనబరిచిన వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) లభిస్తుంది.
ఉన్నత విద్య :
ఉన్నత విద్యకు సంబంధించి సైన్స్ గ్రాడ్యుయేట్లకు ఉన్నన్ని స్పెషలైజేషన్లు బీఏ హిస్టరీ విద్యార్థులకు ఉండవనే అభిప్రాయం చాలామందిలో ఉంది. ఇది నిజం కాదు. హిస్టరీ ఆప్షనల్‌గా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఉన్నత విద్య దిశగా భిన్న రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేయడం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలను అందుకోవచ్చు. ఉదాహరణకు ఎంఏ మ్యూజియాలజీని తీసుకుంటే.. దీన్ని హిస్టరీ గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సుగా చెప్పొచ్చు. ఈ కోర్సులో మ్యూజియంల చరిత్ర, డాక్యుమెంటేషన్, ప్రజెంటేషన్, ఇంటెర్‌ప్రిటేషన్, మ్యూజియం ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్; కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ మ్యూజియం తదితరాలను అధ్యయనం చేస్తారు.
జాబ్ ప్రొఫైల్స్: ఎగ్జిబిషన్ కన్సల్టెంట్, డిప్యూటీ క్యూరేటర్, టీచర్ అండ్ లెక్చరర్, మ్యూజియం గైడ్, ఇంటీరియర్ ఆర్ట్స్ డిజైనర్, కన్జర్వేటర్
ఎంఏ ఆర్కియాలజీ:
వైవిధ్య భరిత కెరీర్‌ను కోరుకునే వారికి ఎంఏ ఆర్కియాలజీ చక్కటి ఎంపిక. ఈ కోర్సులో ఆర్కియాలజీకి సంబంధించిన ప్రాథమిక పద్ధతులు, ఇండియన్ ఆర్కిటెక్చర్, రీసెర్చ్ మెథడాలజీ, ఎర్లీ ఇండియన్ ఆర్ట్ వంటి అంశాల గురించి నేర్చుకుంటారు. ఎంఏ ఆర్కియాలజీ చేస్తే ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ), దాని అనుబంధ విభాగాల్లో అవకాశాలను అందుకోవచ్చు.
జాబ్ ప్రొఫైల్స్: హెరిటేజ్ మేనేజర్, లెక్చరర్ అండ్ టీచర్, హెరిటేజ్ కన్జర్వేటర్, ఆర్కై విస్ట్, గైడ్, డాక్యుమెంటేషన్ స్పెషలిస్ట్, ఇన్ఫ ర్మేషన్ మేనేజర్, హిస్టారియన్, లైబ్రరీ సిస్టమ్స్ అనలిస్ట్.
పోటీలో విజయానికి చరిత్ర !
కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏ పోటీ పరీక్ష అయినా.. హిస్టరీ లేకుండా ప్రశ్నపత్రం ఉండదు. దీన్నిబట్టి పోటీ పరీక్షల్లో హిస్టరీ ప్రాధాన్యమేంటో అర్థంచేసుకోవచ్చు. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీసులను అందిపుచ్చుకునేందుకు వీలుకల్పించే సివిల్స్‌లో చరిత్ర కీలకపాత్ర పోషిస్తోంది. సివిల్స్ ప్రిలిమ్స్‌లో కీలకమైన జనరల్ స్టడీస్ పేపర్ కోసం హిస్టరీని ప్రత్యేక దృష్టితో చదవాల్సి ఉంటుంది. సివిల్స్ మెయిన్స్‌లో జనరల్ స్టడీస్ పేపర్-1 కోసం ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ గురించి అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాష్ర్ట స్థాయిలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే గ్రూప్-1, గ్రూప్-2 తదితర పరీక్షల్లోనూ హిస్టరీ కీలకంగా నిలుస్తుంది. కేవలం సివిల్స్, గ్రూప్స్ వంటి పరీక్షలే కాకుండా ఎస్‌ఎస్‌సీ, రైల్వే తదితర పరీక్షల్లోనూ హిస్టరీకి ప్రాధాన్యం లభిస్తోంది.
చరిత్రతో ఉన్నత అవకాశాలు.. హిస్టరీ.. మానవ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, భాషా పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. చరిత్రను విస్మరిస్తే మానవజాతి గతాన్ని కోల్పోయినట్లే! ప్రస్తుతం ఆర్కియాలజీ, మ్యూజియాలజీ, లింగ్విస్టిక్స్ వంటి స్పెషలైజేషన్లు ఉపాధి కల్పనలో ముందుంటున్నాయి. వీటిని పూర్తిచేసిన వారికి కెరీర్ పరంగా మంచి అవకాశాలు లభిస్తున్నాయి. పోటీ పరీక్షల విషయానికొస్తే హిస్టరీ లేనిదే ప్రశ్నపత్రమే ఉండదని చెప్పొచ్చు. సివిల్స్ విజేతల్లో హిస్టరీ ఆప్షనల్‌ను ఎంచుకున్నవారు ఎక్కువగా ఉంటున్నారు. దీన్నిబట్టి సరైన ప్రణాళికతో హిస్టరీని చదవడం ద్వారా విద్యార్థులు ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. - ప్రొఫెసర్ కె.అర్జునరావు, హెడ్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ హిస్టరీ, ఓయూ. |
అర్హతలు:
బైపీసీతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించినవారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సులో చేరొచ్చు. వీటిలో ప్రవేశాల కు తెలుగు రాష్ట్రాల్లోని డా. ఎన్‌టీఆర్ యూని వర్సిటీ ఆఫ్ హెల్త్‌సెన్సైస్, కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్ ఏటా ప్రత్యేకంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నా యి. బీపీటీ తర్వాత న్యూరాలజీ, ఆర్థోపెడిక్, కార్డియోథొరాసిక్ తదితర స్పెషలైజేషన్లలో పీజీ చేస్తే కెరీర్ పరంగా మంచి అవకాశాలుంటారుయి. ఫిజియోథెరపీ కోర్సులు పూర్తిచేసిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు, రిహాబిలిటేషన్ సెంటర్లు, స్పెషల్ స్కూల్స్, ఫిట్‌నెస్ సెంటర్లు, స్పోర్‌ట్స అకాడ మీల తదితరాల్లో ఉపాధి లభిస్తుంది. విదేశా ల్లోనూ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.
అవసరమైన నైపుణ్యాలు:
రోగులకు సేవ చేయాలనే దృక్పథం ఫిజి యోథెరపిస్టులకు ఉండాలి. మంచి కమ్యూని కేషన్ స్కిల్స్ అవసరం. చికిత్స ఫలించేదాకా ఓపిక, సహనంతో పనిచేయగలగాలి. శారీరకం గా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి.
వేతనాలు:
ఫిజియోథెరపిస్టుకు ప్రభుత్వ ఆసుపత్రు ల్లో ప్రారంభంలో నెలకు రూ.25వేల వేతనం అందుతుంది. చీఫ్ ఫిజియోథెరపిస్ట్ స్థాయికి చేరుకుంటే నెలకు రూ.75 వేలు పొందొచ్చు. ప్రైవేటు రంగంలో ప్రారంభంలో నెలకు రూ.15వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనంలో పెరుగుదల ఉంటుంది. సొంతంగా ఫిజియో థెరపీ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని, సామర్థ్యం బట్టి ఆర్జించొచ్చు.
ఉన్నత విద్య:
- ఎంఏ ఎకనామిక్స్
- ఎంఏ అప్లైడ్ ఎకనామిక్స్
- ఎంఎస్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్
- మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
ఉద్యోగావకాశాలు:
బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తారు. దీంతోపాటు యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్రాల స్థాయిలోని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు జరిపే గ్రూప్స్ పరీక్షలకు హాజరయ్యేందుకు మొగ్గుచూపుతారు. బీఏ ఎకనామిక్స్ తర్వాత ఎకనామిక్స్‌లో పీజీ కూడా పూర్తిచేస్తే.. యూపీఎస్సీ ఏటా నిర్వహించే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్‌కు సన్నద్ధమయ్యే వీలుంది. సబ్జెక్టుపై పట్టు, ప్రతిభ కలిగిన అభ్యర్థులు ఆర్థిక నిపుణులుగా రాణించొచ్చు. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ), నీతి ఆయోగ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వంటి విభాగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. దీంతోపాటు బోధన రంగంలోనూ అవకాశాలకు కొదవలేదు. ఎకనామిక్స్‌లో ఉన్నత విద్య తర్వాత ప్రైవేటు రంగంలో రీసెర్చ్ అనలిస్ట్, మార్కెటింగ్ అనలిస్ట్, ఎకనామిక్ కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించొచ్చు.
ఉపాధి కల్పిస్తున్న రంగాలు:
- ఎకనామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్
- అనాలసిస్ అండ్ ఫోర్‌కాస్టింగ్ సంస్థలు
- స్టాక్‌ఎక్ఛేంజ్‌లు
- బ్యాంకులు, ఇతర క్రెడిట్ యూనిట్లు
- మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థలు
- కంప్యూటర్, టెలీ కమ్యూనికేషన్ సంస్థలు
- గవర్న్‌మెంట్ డిపార్ట్‌మెంట్స్ అండ్ స్టాటిస్టికల్ రీసెర్చ్ సంస్థలు..
టాప్ ఇన్‌స్టిట్యూట్‌లు:
- జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.jnu.ac.in/main
- ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ రీసెర్చ్ (ఐజీఐడీఆర్) ఎంఎస్సీ ఎకనామిక్స్‌ని ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: http://www.igidr.ac.in
- ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ).. ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: http://econdse.org
- సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ స్టడీస్ (తిరువనంతపురం).. ఎంఏ అప్లయిడ్ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: http://www.cds.edu
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంఏ ఎకనామిక్స్‌ను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.uohyd.ac.in
- మద్రాస్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్.. ఎంఏ జనరల్, పైనాన్షియల్, అగ్రికల్చర్, అప్లైడ్ క్వాంటిటేటివ్ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్ వంటి స్పెషలైజేషన్లను ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.mse.ac.in
- ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ).. ఎంఎస్-క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ కోర్సును ఆఫర్ చేస్తోంది.
వెబ్‌సైట్: www.isical.ac.in
- హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in
- హైదరాబాద్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.uohyd.ac.in
- విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత:మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
- తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత:మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.svuniversity.ac.in
- వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత:మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.kakatiya.ac.in
- తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళ విశ్వవిద్యాలయం.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత: మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.spmvv.ac.in
- కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయం.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత:మ్యాథమెటిక్స్ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.yogivemanauniversity.ac.in
- ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీ.. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత:కనీసం రెండేళ్లు డిగ్రీలో మ్యాథమెటిక్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
ప్రవేశం: జామ్ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.iitr.ac.in
- మెస్రాలోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్).. అప్లైడ్ మ్యాథమెటిక్స్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత:కనీసం 55 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో బీఎస్సీ.
ప్రవేశం: అకడమిక్ రికార్డు ఆధారంగా.
వెబ్‌సైట్: www.bitmesra.ac.in
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ - ఐఆర్‌ఎం క్యాంపస్ (జైపూర్)
వివరాలకు: www.iirm.ac.in
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ - ఆనంద్ (గుజరాత్)
వివరాలకు: www.irma.ac.in
- జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్ - భువనేశ్వర్.
వివరాలకు: www.ximb.ac.in
- ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)-న్యూఢిల్లీ, దూర విద్యా విధానంలో ఎంఏ (రూరల్ డెవలప్‌మెంట్) కోర్సును అందిస్తుంది.
అర్హత:ఏదైనా గ్రాడ్యుయేషన్.
వివరాలకు: www.ignou.ac.in
ఒక మనిషి వ్యవహారశైలిని సమాజానికి అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించే కోర్సు.. సోషియాలజీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యూనివర్సిటీల్లోనూ బీఏలో సోషియాలజీ ఒక సబ్జెక్ట్‌గా అందుబాటులో ఉంది. అంతేకాకుండా వివిధ విద్యా సంస్థలు సోషియాలజీలో ఎంఏ, ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. పీహెచ్‌డీలో ఉమెన్ డవలప్‌మెంట్, రూరల్ డవలప్‌మెంట్, ట్రైబల్ డవలప్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లలో రీసెర్చ్ చేయడం ద్వారా చక్కని అవకాశాలను అందుకోవచ్చు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) సహా మరెన్నో యూనివర్సిటీలు దూర విద్యా విధానంలో సోషియాలజీలో బ్యాచిలర్ నుంచి పీహెచ్‌డీ వరకు పలు కోర్సులను అందిస్తున్నాయి.
సోషియాలజీ కోర్సు పూర్తి చేసిన వారికి అకడమిక్ అండ్ రీసెర్చ్ సంస్థలు, కార్పొరేట్ సంస్థల కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విభాగాలు, స్వచ్ఛంద సంస్థలు తదితరాలు కెరీర్ వేదికలుగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా స్వయం ఉపాధి దిశగా ఆలోచించవచ్చు. ఫ్యామిలీ కౌన్సిలర్లుగా, కమ్యూనిటీ కౌన్సిలర్లుగా మారొచ్చు. సోషియాలజీ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రారంభంలో నెలకు కనీసం రూ.15 వేల వేతనం ఖాయం. కార్పొరేట్ సంస్థల్లో మంచి వార్షిక వేతనం ఉంటుంది.
- హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ.. సోషల్ వర్క్‌లో మాస్టర్స్‌ను అందిస్తోంది.
అర్హత: కనీసం 40 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in
- విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ.. సోషల్ వర్క్‌లో ఎంఏ అందిస్తోంది.
అర్హత: సోషల్ వర్క్‌లో బీఏ లేదా సోషల్ సెన్సైస్ ఒక సబ్జెక్టుగా బీఏ/ బీఎస్సీ/ బీసీఏ/బీకాం/బీఏఎల్/బీఎఫ్‌ఏ/ బీబీఎం.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
- తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరా విశ్వవిద్యాలయం.. సోషల్ వర్క్‌లో ఎంఏ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.svuniversity.ac.in
- గుంటూరులో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. సోషల్ వర్క్‌లో ఎంఏ అందిస్తోంది.
అర్హత: డిగ్రీ.
వెబ్‌సైట్: www.anucde.info
- ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. సోషల్ వర్క్‌లో మాస్టర్స్ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.ignou.ac.in
- అలహాబాద్‌లోని గోవింద్ వల్లభ్ పంత్ సోషల్ సైన్స్ ఇన్‌స్టిట్యూట్... రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంబీఏ అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.gbpssi.nic.in - గుజరాత్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (ఐఆర్‌ఎంఏ), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.irma.ac.in - రాంచీలోని జేవియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సర్వీస్ (ఎక్స్‌ఐఎస్‌ఎస్), రూరల్ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.xiss.ac.in - పశ్చిమ బెంగాల్‌లోని రామకృష్ణ మిషన్ వివేకానంద విశ్వవిద్యాలయం, రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బయోసైన్స్/సోషల్ సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్టులో బీఎస్సీ (ఆనర్స్)
ప్రవేశం: ప్రవేశపరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.rkmvu.ac.in - ఢిల్లీలోని ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎంఏ అందిస్తోంది.
అర్హత:ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.ignou.ac.in - అనంతపురంలో శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు అందిస్తోంది. అర్హత: ఏదైనా డిగ్రీ.
వెబ్‌సైట్: www.skuniversity.org - వరంగల్‌లో కాకతీయ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లెర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్, దూరవిద్య విధానంలో రూరల్ డెవలప్‌మెంట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ.
వెబ్‌సైట్: www.sdlceku.co.in
- విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. యోగాలో ఒకేడాది పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
- గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ.. యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్‌లో పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ. వారానికి మూడు రోజులు క్లాసులు నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: www.nagarjunauniversity.ac.in
- తిరుపతిలోని రాష్ట్రీయ విద్యా పీఠ.. యోగ విజ్ఞానలో ఒకేడాది పీజీ డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ
వెబ్‌సైట్: www.rsvidyapeetha.ac.in
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. ఫిల్మ్ అండ్ మీడియాలో ఎంఏను అందిస్తోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ.
ప్రవేశం: అకడమిక్ రికార్డు, అప్లికేషన్ ఎస్సే, ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
ఇదే సంస్థ డెరైక్షన్ ఫర్ ఫిల్మ్ అండ్ టెలివిజన్‌లో షార్ట్ టర్మ్ కోర్సులను అందిస్తోంది.
వెబ్‌సైట్: www.aisfm.edu.in
హైదరాబాద్‌లోని రామానాయుడు ఫిల్మ్ స్కూల్.. డెరైక్షన్ అండ్ స్క్రీన్‌ప్లే రైటింగ్‌లో డిప్లొమా కోర్సును అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
వెబ్‌సైట్: www.ramanaidufilmschool.net
- విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం.. సోషియాలజీలో ఎంఏ కోర్సును అందిస్తోంది.
అర్హత: బీఏ/ బీకాం/ బీఎస్సీ/ హోంసైన్స్‌లో బీఎస్సీ/ బీఎస్సీ అగ్రికల్చర్/ బీఎస్సీ నర్సింగ్/ బీబీఎం/ బీసీఏ/ బీఏఎల్.
ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
- తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం.. సోషియాలజీలో ఎంఏ కోర్సును అందిస్తోంది.
అర్హత: డిగ్రీ
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.svuniversity.ac.in
- హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం.. సోషియాలజీలో ఎంఏ కోర్సును అందిస్తోంది.
అర్హత:కనీసం 40 శాతం మార్కులతో బీఏ/బీకాం/బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఉద్యోగావకాశాలు: అడ్వర్‌టైజింగ్, మార్కెటింగ్, పబ్లిషింగ్, జర్నలిజం వంటి రంగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విద్యా, పరిశోధన, ప్రభుత్వ డిపార్ట్‌మెంట్లలో ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసుపత్రులు, కౌన్సెలింగ్ కేంద్రాలు, కరెక్షన్ సెల్స్, వృద్ధాశ్రమాలు, రూరల్ హెల్త్, బిజినెస్ సంస్థల్లోని హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌లో కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు ఉన్నత హోదాలు పొందవచ్చు.
తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరా విశ్వవిద్యాలయం ఎకనోమెట్రిక్స్‌లో ఎంఏ కోర్సును అందిస్తోంది.
అర్హత:డిగ్రీ
ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా.
వెబ్‌సైట్: www.svuniversity.ac.in
తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం ఎకనోమెట్రిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
అర్హత: 50 శాతం మార్కులతో మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో డిగ్రీ.
ప్రవేశం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగా.
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
తమిళనాడులోని భారతియార్ విశ్వవిద్యాలయం ఎకనోమెట్రిక్స్‌లో ఎంఎస్సీ కోర్సును అందిస్తోంది.
అర్హత: మ్యాథమెటిక్స్/ స్టాటిస్టిక్స్/ ఎకనామిక్స్/ ఎకనోమెట్రిక్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ.
వెబ్‌సైట్: www.b-u.ac.in
అర్హత: హిస్టరీ సబ్జెక్టుతో బీఏ
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా
వెబ్‌సైట్: www.svuniversity.in
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎంఏ ఇన్ హిస్టరీ అండ్ ఆంత్రోపాలజీ కోర్సు అందిస్తోంది.
అర్హత: బీఏ హిస్టరీ/ హిస్టరీ ఒక సబ్జెక్టుగా బీఏ(ఓఎల్)/ బీఎఫ్‌ఏ.
వెబ్‌సైట్: www.andhrauniversity.info
- నేషనల్ మ్యూజియం ఇన్‌స్టిట్యూట్-ఢిల్లీ.
కోర్సు: ఎంఏ (మ్యూజియాలజీ)
అర్హత: బీఎస్సీ/బీఎఫ్‌ఏ/బీఏ
ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
వివరాలకు: nmi.gov.in
- ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ మ్యూజియాలజీ
అర్హత: 50 శాతం మార్కులతో మ్యూజియాలజీ ఒక సబ్జెక్ట్‌గా ఎంఏ (ఏఐహెచ్‌సీ అండ్ ఏ) లేదా ఎంఏ(హిస్టరీ-మిడీవల్ హిస్టరీ స్పెషలైజేషన్‌గా).
ప్రవేశం: రాత పరీక్ష ఆధారంగా
వివరాలకు: www.osmania.ac.in
- యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా
కోర్సు: ఎంఏ (మ్యూజియాలజీ)
వివరాలకు: www.caluniv.ac.in
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ-గుంటూరు.
కోర్సు: ఎంఏ(యానిసెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ).
వివరాలకు: www.nagarjunauniversity.ac.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి.
కోర్సు: ఎంఏ(హిస్టరీ-యానిసెంట్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ)
వివరాలకు: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.
కోర్సు: ఎంఏ(యానిసెంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ)
వివరాలకు: www.andhrauniversity.info
సినిమా, టెలివిజన్ కార్యక్రమాలను అందంగా, ఆసక్తి కరంగా రూపొందించడంలో ఎడిటింగ్ విభాగానిది కీలకపాత్ర. ఈ విభాగంలో ఆర్టిస్టిక్, టెక్నికల్ విధానాలు ఇమిడి ఉంటాయి. ఎడిటింగ్ విభాగంలో.. ఫిల్మ్ ఎడిటర్, వీడియో ఎడిటర్ అనే రెండు కేటగిరీలు ఉంటాయి. వీడియో ఎడిటర్లు సాధారణంగా వివిధ చానెల్స్, స్టూడియోలలో కార్యక్రమాల్లోని నిర్దేశిత విభాగాలను ఎడిట్ చేస్తారు. ఇందు కోసం అడోబ్-ప్రీమియర్ సాఫ్ట్‌వేర్‌ను నేర్చుకోవాలి. ఫిల్మ్ ఎడిటర్.. సినిమా మొత్తాన్ని ఎడిట్ చేస్తాడు. వీరు అవిడ్, ఆపిలస్ ఫైనల్ కట్ ప్రో వంటి అడ్వాన్స్‌డ్ ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ నేర్చుకోవాలి. వీరికి ప్రధానంగా ఫిల్మ్, టీవీ ప్రొడక్షన్ స్టూడియోస్, టీవీ చానల్స్, వెబ్‌డిజైనింగ్ కంపెనీలు, అడ్వర్‌టైజింగ్ కంపెనీలు, మల్టీమీడియా కంపెనీల్లో అవకాశాలు ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో వీరికి నెలకు ’ 8-10 వేల వరకు వేతనం లభిస్తుంది. తర్వాత అనుభవం, సీనియారిటీని బట్టి నెలకు ’ 25-30 వేలు జీతాన్ని సంపాదించవచ్చు.
ఆఫర్ చేస్తోన్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా-పుణే. వెబ్‌సైట్: www.ftiindia.com
సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్-
కోల్‌కతా.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటరాక్టివ్ ఓరియెంటేషన్ సెషన్ అండ్ వైవా, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా.
విష్‌లింగ్ ఉడ్స్ ఇంటర్నేషనల్ -ముంబై
వెబ్‌సైట్: www.whistlingwoods.net
జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మీడియా ఆర్ట్స్-ముంబై
వెబ్‌సైట్: www.zimainstitute.com
ఎడిటింగ్ కోర్సును ఆఫర్ చేస్తోన్న సంస్థలు:
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్- కోల్‌కత.
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సినిమా (ఎడిటింగ్ స్పెషలైజేషన్‌తో).
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటరాక్టివ్ ఓరియెంటేషన్ సెషన్, వైవా ఆధారంగా.
వివరాలకు: https://srfti.gov.in
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా - పుణే
కోర్సులు:పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (ఎడిటింగ్ స్పెషలైజేషన్‌తో). పీజీ సర్టిఫికెట్ ఇన్ టెలివిజన్ (వీడియో ఎడిటింగ్ స్పెషలైజషన్‌తో)
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
వివరాలకు: www.ftiindia.com
చెన్నై ఫిల్మ్ ఇండస్ట్రియల్ స్కూల్-చెన్నై.
కోర్సు: ఎడిటింగ్‌లో సర్టిఫికెట్.
అర్హత: పదో తరగతి
వివరాలకు: www.chennaifilmschool.org
సెంటర్ ఫర్ విజువల్ మీడియా ఎక్సలెన్స్-హైదరాబాద్
కోర్సులు: సినిమా ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్.
వివరాలకు: www.cvme.in
ప్రోవ్‌ఎఫ్‌ఎక్స్ (provfx) విజువల్ ఎఫెక్ట్స్ అండ్ ఎడిటింగ్ స్కూల్-హైదరాబాద్.
ఫిల్మ్/వీడియో ఎడిటింగ్‌లో షార్ట్ టర్మ్ కోర్సులు
వివరాలకు: www.provfx.net
డెరైక్షన్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థలు:
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్- కోల్‌కతా.
కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సినిమా (డెరైక్షన్ స్పెషలైజేషన్‌తో).
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
ఎంపిక: రాత పరీక్ష, ఇంటరాక్టివ్ ఓరియెంటేషన్ సెషన్, వైవా ఆధారంగా.
వివరాలకు: www.srfti.gov.in
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా- పుణే
కోర్సులు: పీజీ డిప్లొమా ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ (డెరైక్షన్ స్పెషలైజేషన్‌తో).
అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్.
వివరాలకు: www.ftiindia.com
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్
వివరాలకు: www.filmandtelevisioninstitueofandhrapradesh.com
కోర్సులు: పీజీ డిప్లొవూ ఇన్ సినివూ (డెరైక్షన్, స్క్రీన్‌ప్లే, సినివూటోగ్రఫీ, ఆడియోగ్రఫీ, ఎడిటింగ్)
వెబ్‌సైట్: www.srfti.gov.in
ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియూ, పుణే
కోర్సులు: పీజీ డిప్లొవూ ఇన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్(డెరైక్షన్, సినివూటోగ్రఫీ, సౌండ్ డిజైన్, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్)..
సర్టిఫికెట్ కోర్సులు: డెరెక్షన్,ఎలక్ట్రానిక్ సినివూటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్. వెబ్‌సైట్: www.ftiindia.com
వుధు ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్, యూసఫ్‌గూడ, హైదరాబాద్. డెరైక్షన్, స్క్రిప్ట్‌కు సంబంధించి కోర్సులను అందిస్తోంది.
సినిమా డెరైక్షన్... సినిమా నిర్మాణంలో అత్యంత క్లిష్టమైన, సృజనాత్మక ప్రక్రియ. ఇందులో ప్రావీణ్యం, నైపుణ్యం సాధించడానికి ఎంతో శ్రమ, సహనం అవసరం. అయితే, సినిమా రంగంలో స్థిరపడాలనుకుంటే మాత్రం... అనేక విభాగాల్లో అవకాశాలున్నాయి. సినిమా నిర్మాణంలో... డెరైక్షన్, ఫొటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డెరైక్షన్, ఎడిటింగ్, సౌండ్ రికార్డింగ్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ విభాగాల పాత్ర ఎంతో కీలకం. అర్డ్, సౌండ్ విభాగాల్లో ప్రవేశించాలనుకుంటే... సంబంధిత డిప్లొమా కోర్సులను పూర్తిచేయడం మంచిది. మన దేశంలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్(పుణె), సత్యజిత్‌రే ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్ (కోల్‌కతా), ఫిల్మ్ అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ తమిళనాడు(చెన్నై), ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమిట్స్(లక్నో), ఏసియన్ అకాడెమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ(నోయిడా), ఏజేకే మాస్ కమ్యూనికేషన్ రీసెర్చ్ సెంటర్(ఢిల్లీ) వంటి సంస్థలు సినిమా కోర్సులు అందించడంలో పేరు సంపాదించాయి.
వెబ్‌సైట్: www.econdse.orgl
ఎంఏ(ఎకనామిక్స్): అర్హత-గ్రాడ్యుయేషన్ లేదా ఎకనామిక్స్‌తో బీఏ(ఆనర్స్)/బీఎస్సీ(ఆనర్స్) లేదా 60 శాతం మార్కులతో ఏదైనా పీజీ. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. ఈ పరీక్ష ఎకనామిక్స్/కామర్స్ లేదా ఇతర అంశాల్లో ఉంటుంది. రెండింటిలో దేన్ని ఎంచుకోవాలనేది అభ్యర్థి దరఖాస్తు సమ యంలోనే నిర్ణయించుకోవాలి.
ఎంఫిల్(ఎకనామిక్స్): అర్హత- ఎకనామిక్స్ లేదా తత్సంబంధిత అంశాల్లో మాస్టర్ డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో ఇంజనీ రింగ్. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ క ల్పిస్తారు.
పీహెచ్‌డీ(ఎకనామిక్స్): అర్హత-50 శాతం మార్కులతో ఎంఫిల్ లేదా 55 శాతం మార్కులతో ఎకనామిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేష న్ లేదా పరిశోధన కోసం ఈ అంశాన్ని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులు. అడ్మిషన్ ప్రవేశ పరీక్ష లేదా డాక్ట్టోరల్ రీసెర్చ్ కోసం సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా.
వెబ్‌సైట్: www.econdse.org
http://teluguuniversity.ac.in
ఎంఏ(ఎకనామిక్స్): అర్హత-గ్రాడ్యుయేషన్ లేదా ఎకనామిక్స్‌తో బీఏ(ఆనర్స్)/బీఎస్సీ(ఆనర్స్) లేదా 60 శాతం మార్కులతో ఏదైనా పోస్ట్‌గ్రాడ్యుయేషన్. ప్రవేశ పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఉంటుంది. ఈ పరీక్ష ఎకనామిక్స్/కామర్స్ లేదా ఇతర అంశాల్లో ఉంటుంది. రెండింటిలో దేన్ని ఎంచుకోవాలనేది అభ్యర్థి దరఖాస్తు సమయంలోనే నిర్ణయించుకోవాలి.
ఎంఫిల్(ఎకనామిక్స్): అర్హత- ఎకనామిక్స్ లేదా తత్సంబంధిత అంశాల్లో మాస్టర్ డిగ్రీ లేదా 55 శాతం మార్కులతో ఇంజనీ రింగ్. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అడ్మిషన్ క ల్పిస్తారు.
పీహెచ్‌డీ(ఎకనామిక్స్): అర్హత-50 శాతం మార్కులతో ఎంఫిల్ లేదా 55 శాతం మార్కులతో ఎకనామిక్స్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ లేదా పరిశోధన కోసం ఈ అంశాన్ని ఎంచుకోవాలనుకునే అభ్యర్థులు. ప్రవేశ పరీక్ష లేదా డాక్ట్టోరల్ రీసెర్చ్ కోసం సమర్పించిన ప్రతిపాదన ఆధారంగా ప్రవేశం. వెబ్‌సైట్: www.econdse.org
పీజీ సోషల్ వర్క్‌ను ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
ఉస్మానియూ యుూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
శ్రీ వేంకటేశ్వర యుూనివర్సిటీ- తిరుపతి.
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆంధ్రా యుూనివర్సిటీ -విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.info
పీహెచ్‌డీ కోసం ధీసీస్ సమర్పించాలి.ఎంఫిల్‌లో కోర్సు వర్క్, సిద్ధాంత వ్యాసం ఉంటారుు. రెండు సెమి స్టర్లలో నాలుగు సబ్జెక్టులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎకనామిక్ అనాలిసిస్ లేదా స్టాటిస్టికల్ అండ్ ఎకనా మెట్రిక్ మెథడ్స్‌లో ఒక అంశాన్ని తప్పనిసరిగా, మిగతా మూడు అంశాల్ని ఐచ్ఛికాంశాల నుంచి ఎంపిక చేసుకోవాలి. అనలిటికల్ అంశాలు, సమకాలీన పరిశోధ నాంశాలు వీటిల్లో ఉంటాయి.
పీహెచ్‌డీ అంటే మూడు నాలుగేళ్లలో పూర్తి చేసుకుని పట్టాతో బయటపడేది కాదు. ఏ అంశంపై పరిశోధన చేయాలను కుంటున్నారో ముందుగా నిర్ణరుుంచు కుని ఆ సబ్జెక్టులో నిష్ణాతులైన గైడ్ ఆధ్వర్యంలో రీసెర్చ్ స్కాలర్‌గా కొనసాగాలి. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వ విద్యాలయం (ఇగ్నో) కూడా ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ ఆఫర్ చేస్తోంది. పీజీ స్థాయిలో కనీసం 55 శాతం (ఎస్సీ/ ఎస్టీలు 50 శాతం)తో పాటు సంబంధిత అంశంలో ఎంఫిల్ చేసి ఉండాలి. లేదా, సీనియర్ లెవెల్‌లో కనీసం 5 సంవత్సరాలు టీచింగ్/ అడ్మినిస్ట్రేషన్/ ఇండస్ట్రీ/ ప్రొఫెషనల్ అనుభవం కలిగి ఉండాలి.
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి
ఎంఏ (హిస్టరీ, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీతో కల్చర్ అండ్ ఆర్కియాలజీ స్పెషలైజేషన్స్‌గా).
అర్హత: బీఏ(హిస్టరీ). రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం.
వివరాలకు: www.svuniversity.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం,
ఎంఏ (ఏన్షియంట్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ). అర్హత: బీఏ (హిస్టరీ/ ఓఎల్)లేదా బీఎఫ్‌ఏ.
వివరాలకు: www.andhrauniversity.info