Skip to main content

Animation & Multimedia

యానిమేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్.. యానిమేషన్‌లో డిగ్రీని అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
వెబ్‌సైట్: www.iacg.co.in
 
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌లో డిగ్రీని అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
వెబ్‌సైట్: www.aisfm.edu.in
మా అబ్బాయి ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. మల్టీమీడియాలో ఆసక్తి ఉందని చెబుతున్నాడు. ఈ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్‌ల గురించి తెలపండి?
+
  • హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్.. మల్టీమీడియా, వీఎఫ్‌ఎక్స్‌లలో డిగ్రీ అందిస్తోంది. ఇది హైదరాబాద్ జేఎన్‌టీయూకు అనుబంధ సంస్థ.
    అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: జేఎన్‌టీయూహెచ్ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • ఇదే సంస్థ మల్టీమీడియా, వీఎఫ్‌ఎక్స్‌లలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    బీటెక్/ బీకాం/బీఎస్సీ.
    ప్రవేశం: జేఎన్‌టీయూహెచ్ నిర్వహించే ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.iacg.co.in
  • హైదరాబాద్‌లోని పికాసో యానిమేషన్ కాలేజ్.. మల్టీమీడియాలో డిగ్రీ అందిస్తోంది.
    అర్హత:
    ఇంటర్మీడియెట్/10+2. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి.
    ప్రవేశం: క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
  • ఇదే సంస్థ.. మల్టీమీడియాలో ఎంఎస్సీ అందిస్తోంది.
    అర్హత:
    ఏదైనా డిగ్రీ. కమ్యూనికేషన్, క్రియేటివ్ నైపుణ్యాలు ఉండాలి.
    ప్రవేశం: క్రియేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్:  www.picasso.co.in
యానిమేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
+
  • సాధారణంగా యానిమేషన్ కోర్సు చేసిన అభ్యర్థులు బృందాల్లో పనిచేస్తుంటారు. వీళ్లు స్టోరీ బోర్డులు, టైప్ సెట్టింగ్, ఎడిటింగ్ ప్రాసెస్‌లలో పాల్గొంటారు. రాళ్లు, గుహలపై పురాతన కాలంలో వేసిన బొమ్మల నుంచి ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెంది కదిలే చిత్రాలను తెరపై చూపించే దశకు చేరుకుంది. గ్రాఫిక్స్ ప్రక్రియను కనుగొన్న నాటి నుంచే యానిమేషన్‌లో అద్భుతమైన ఆవిష్కరణలు జరిగాయి.
  • క్రియేటివ్ స్కిల్స్, టెక్నికల్ నైపుణ్యాలు ఉన్న వారికి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉంటుంది.
  • జేఎన్‌టీయూకు అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అకాడెమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ కోర్సులో డిగ్రీని అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.jnafau.ac.in
  • హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా, యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌లో డిగ్రీని అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.aisfm.edu.in
  • సికింద్రాబాద్‌లోని జీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్స్, యానిమేషన్‌లో డిప్లొమాను, సర్టిఫికెట్ కోర్సును అందిస్తోంది.
    అర్హత: ఇంటర్మీడియెట్/10+2
    ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
    వెబ్‌సైట్: www.zica.org  
యానిమేషన్‌ కోర్సు చదువుతున్నాను. కొద్దిగా నత్తి. ఉద్యోగసాధనలో నా లోపం ఏ విధంగానైనా ఆవరోధంగా మారుతుందా?
+
మీ లోపం అంత తీవ్రమైంది కాదు. ఉద్యోగ విషయానికొస్తే.. టెక్నికల్‌ లేదా నాన్‌వాయిస్‌ బేస్డ్‌ ఉద్యోగాల్లో కంఠంతో అంతగా పని ఉండదు. కాబట్టి అటువంటి జాబ్స్‌ కోసం ప్రయత్నిస్తే ఎటువంటి సమస్య ఉండదు. ఆఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందు కంపెనీకి మీ లోపం గురించి తెలియజేయడం మంచిది. ప్రస్తుతం మీరు చేస్తున్న కోర్సుకు సంబంధించి అన్ని అంశాలపై పట్టు సాధించండి. కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా విభిన్న మార్గాల ద్వారా సబ్జెక్ట్‌ నాలెడ్జ్‌ను పెంచుకోవటానికి ప్రయత్నించండి. మీ లోపాన్ని సవరించుకోవడానికి ఉద్దేశించిన కొన్ని రకాల థెరిపీలు ఉంటాయి. వాటి ద్వారా మీ సమస్యను అధిగమించవచ్చు.
విజువల్‌ కమ్యూనికేషన్స్‌ సంబంధిత కోర్సులను అందిస్తోన్న సంస్థలేవి?
+
 జవహర్‌లాల్‌ నెహ్రూ కాలేజీ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌. ఫోటోగ్రఫీ, విజువల్‌ కమ్యూనికేషన్స్‌ స్పెషలైజేషన్స్‌గా ఎంఎఫ్‌ఏ కోర్సును అందిస్తోంది. ఫొటోగ్రఫీలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉన్న వారు ఈ కోర్సుకు అర్హులు. రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
వెబ్‌సైట్‌: www.jnafau.ac.in
ఆంధ్రా లయోలా కాలేజీ, విజయవాడ బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్స్‌, కంప్యూటర్‌సైన్స్‌, ఎలక్ట్రానిక్స్‌)ను ఆఫర్‌ చేస్తోంది.
అర్హత: 10+2 ఉత్తీర్ణత. అలాగే ఎంఎస్సీ (విజువల్‌ కమ్యూనికేషన్స్‌)ను కూడా అందిస్తోంది.
వెబ్‌సైట్‌: www.andhraloyolacollege.ac.in
ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ తమిళనాడు కూడా ఎంఎస్సీ (విజువల్‌ కమ్యూనికేషన్స్‌)ను ఆఫర్‌ చేస్తోంది.
అర్హత: ఏదైనా డిగ్రీ చేసిన వారు దీనికి అర్హులు.
వెబ్‌సైట్‌: www.srmuniv.ac.in
మద్రాస్‌ క్రిస్టియన్‌ కాలేజీ, చెన్నై బీఎస్సీ (విజువల్‌ కమ్యూని కేషన్స్‌)ను అందిస్తోంది.
వెబ్‌సైట్‌: https://mcc.edu.in
లయోలా కాలేజీ, చెన్నై ఎంఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్స్‌)ను ఆఫర్‌ చేస్తోంది. బీఎస్సీ(విజువల్‌ కమ్యూనికేషన్స్‌) పూర్తి చేసిన వారు దీనికి అర్హులు.
వెబ్‌సైట్‌: www.loyolacollege.edu
యానిమేషన్‌ కోర్సు వివరాలను తెలపండి?
+
ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో యూనిమేషన్‌ నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. అచేతన స్థితిలో ఉన్న చిత్రాలకు ప్రాణం ఉన్నట్లుగా మలచి వాటిల్లో కదలికలు తెప్పించడమే యూనిమేషన్‌ ప్రత్యేకత. సాంకేతిక నైపుణ్యంతో ఇలాంటి చిత్రాలను కదలించి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా వివిధ కార్యక్రమాలను యానిమేషన్‌ నిపుణులు రూపొందిస్తారు. ఇందులో 2డీ, 3డీ వంటి వివిధ రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులో రాణించడానికి అభ్యర్థులకు కొన్ని లక్షణాలు తప్పనిసరి. అవి.. సూక్ష్మపరిశీలన, సృజనాత్మకత, నూతన అంశాలను నేర్చుకోవాలనే తపన, సాంకేతిక పరిజ్ఞానం పట్ల అభిరుచి వంటివి.
యానిమేషన్‌ కోర్సులను ఆఫర్‌ చేస్తున్న సంస్థలు :
జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌-యూనిమేషన్‌ ప్రత్యేకాంశంగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సును ఆఫర్‌ చేస్తుంది.
అర్హత: 10+2 ఉత్తీర్ణులు
వెబ్‌సైట్‌: https://jnafau.ac.in
బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ - మెస్రా క్యాంపస్‌
కోర్సు: బీఎస్సీ(యానిమేషన్‌ అండ్‌ మల్టీమీడియా)
అర్హత: 10+2
ఎంపిక: క్రియేటివిటీ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఆధారంగా
వెబ్‌సైట్‌: www.bitmesra.ac.in
మన రాష్ట్రంలో ఎరీనా మల్టీమీడియూ, జీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్రియేటివ్‌ ఆర్ట్స్‌, పికాసో యూనిమేషన్‌ కాలేజ్‌, రేస్‌ ది యూనిమేషన్‌  కాలేజ్‌ వంటి మరెన్నో సంస్థలు యూనిమేషన్‌లో స్వల్పకాలిక కోర్సుల నుంచి అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులను కూడా ఆఫర్‌ చేస్తున్నారుు.
మల్టీమీడియా కోర్సులు చేయడానికి అర్హతలేమిటి? 2డీ, 3డీ కోర్సులంటే ఏమిటీ? మల్టీమీడియాకు మంచి భవిష్యత్‌ ఉంటుందా?
+
స్క్రిప్ట్‌, గ్రాఫిక్స్‌, సౌండ్‌, యానిమేషన్‌, వీడియోల కలయికే... మల్టీమీడియా! ఇది సృజనాత్మకత, సాంకేతిక పరిజ్ఞానాల మేళవింపు. సినిమా, యాడ్స్‌, గేమ్స్‌, వెబ్‌సైట్‌ రూపకల్పన వంటి పలు రంగాల్లో... ఇటీవల మల్ట్టీమీడియా వినియోగం బాగా పెరిగింది. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడానికి పలు శిక్షణా సంస్థలు వెలిశాయి. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా కోర్సులను రూపొందించి, శిక్షణ ఇచ్చి ఉపాధి మార్గాలు సైతం చూపిస్తున్నాయి. ఈ కోర్సులకు కనీస విద్యార్హత, టెన్త్‌, ఇంటర్మీడియెట్‌.
అయితే ఆయా కోర్సులకు అభ్యసించే విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు అవసరం.

కోర్సులు...
2డీ:
యానిమేషన్‌లో ప్రాథమికంగా 2డీ, 3డీ కోర్సులుంటాయి. 2డీ యానిమేషన్‌లో మ్యాన్‌వల్‌గా చిత్రాలు రూపొందించి... వాటిని క్రమపద్ధతిలో కదిలిస్తూ పని చేయాల్సి ఉంటుంది. బొమ్మలు బాగా వేయగలిగే వారు ఇందులో తేలిగ్గా రాణించొచ్చు. వాల్ట్‌డిస్నీ రూపొందించిన మిక్కీ మౌస్‌, ప్రజాదరణ పొందిన టాం అండ్‌ జెర్రీ వంటి పలు యానిమేషన్‌ క్యారెక్టర్లు 2డీ లో రూపొందినవే. టీవిల్లో ప్రత్యక్ష ప్రసారాలు, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ కోసం 3డీని ఉపయోగిస్తారు. కంప్యూటర్‌ వినియోగం అధికంగా ఉంటుంది.
3డీ...
మాడ్యులర్‌: పాత్రల స్వభావాలను అనుసరించి స్వరూపాలను రూపొందించండం వీరి పని. పాత్రకు భౌతిక రూపాన్ని ఇచ్చి, సహకరించాల్సి ఉంటుంది.
రిగ్గింగ్‌: యానిమేషన్‌ చిత్రాలు తీసినప్పుడు వివిధ శరీర అవయవాలకు సంబంధించిన కీళ్ల భాగాలను ప్రత్యేకంగా రూపొందించే పనిలో వీరి అవసరం ఉంటుంది. బీఎఫ్‌ఏ చేసిన అభ్యర్థులు, ప్రత్యేకించి చిత్ర కళ తెలిసిన అభ్యర్థులు ఇందులో ప్రవేశించవచ్చు.
టెక్చరింగ్‌: యానిమేషన్‌ చిత్రాలకు చర్మంపై వివిధ రంగులు వాడాల్సి ఉంటుంది. పెయింటింగ్‌లో ప్రవే శం ఉన్నవారికి ఈ కోర్సు బాగా నప్పుతుంది.
సైట్‌ డిజైనర్‌: కార్యక్రమ రూపకల్పనలో పరిసరాల ను రూపొందించడం వీరి బాధ్యత.
కంపోజింగ్‌: అడాబ్‌ ప్రీమియర్‌, ఎవిడ్‌ కంప్యూటర్‌ పరిజ్ఞానం అవసరం. ఇవేకాకుండా... గ్రాఫిక్‌ డిజైనింగ్‌, వెబ్‌ డిజైనింగ్‌, ఆడియో - వీడియో ఎడిటింగ్‌, త్రీడీ మోడలింగ్‌ అండ్‌ యానిమేషన్‌ వంటి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
భవిష్యత్‌ బంగారం: ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలు యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలుగా మారు తున్నాయి. మరోవైపు విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి భారీ సంస్థలు కూడా గేమింగ్‌ ప్రోగ్రాంలు అభివృద్ధి చేయడం ద్వారా ఈ రంగంలో అడుగు పెట్టే యోచనలో ఉన్నాయి. పాశ్చాత్య దేశాలతో పోల్చితే మన దేశంలో యానిమేషన్‌ ప్రాజెక్టులు రూపొందించడానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. దాంతో విదేశీ సంస్థలు తమ ప్రాజెక్టుల రూపకల్పనకు భారత్‌ను వేదికగా చేసు కుంటున్నాయి. అందువల్ల భవిష్యత్‌లో అవకాశాలు మరింత విస్తతమయ్యే అవకాశముంది.