Skip to main content

AIIMS Recruitment 2024: ఎయిమ్స్‌ రాయ్‌పూర్‌లో 129 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌), రాయ్‌పూర్‌.. బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Faculty Jobs at AIIMS Raipur   AIIMS Raipur    Backlog vacancies available   Vacancy announcement    for application

మొత్తం పోస్టుల సంఖ్య: 129
పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్‌ ప్రొఫసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌. విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, క్లినికల్‌ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ, ఎండీ, ఎంఎస్, ఎంసీహెచ్, డీఎం, డాక్టరేట్‌ డిగ్రీతోపాటు బోధన/పరిశోధనానుభవం ఉండాలి.
వయసు: ప్రొఫెసర్‌/అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌/అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కాపీకి జిరాక్స్‌లను జతచేసి రిక్రూట్‌మెంట్‌ సెల్, రెండో ఫ్లోర్, మెడికల్‌ కాలేజ్‌ బిల్డింగ్, గేట్‌ నెం.5, ఎయిమ్స్‌ రాయ్‌పూర్, జీఈ రోడ్, తాటిబంద్, రాయ్‌పూర్‌-492099(సి.జి.) చిరునామకు పంపించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.04.2024.

వెబ్‌సైట్‌: https://www.aiimsraipur.edu.in/

చదవండి: Non Faculty Jobs at IIT Tirupati: ఐఐటీ తిరుపతిలో నాన్‌ టీచింగ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 28 Mar 2024 10:20AM

Photo Stories