Skip to main content

TSCHE: సెట్‌ల పరీక్షల తేదీలు ఖరారు.. ఏ ‘సెట్‌’ ఎప్పుడో తెలుసుకోండిలా..

వచ్చే విద్యా సంవత్సరం (2022–23)లో వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను తేలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి ప్రకటించారు.
TS CETs 2022 exam dates have been released
'సెట్‌'ల తేదీలను వెల్లడిస్తున్న ప్రొఫెసర్‌ లింబాద్రి. చిత్రంలో వెంకటరమణ, శ్రీనివాస్‌

లాసెట్‌, ఐసెట్‌, ఎడ్‌సెట్‌ తదితర పరీక్షలను జూలైలోనే నిర్వహించనున్నట్టు తెలిపారు. అయితే ఇతర పరీక్షలు రాయాల్సి వస్తే ఆయా సెట్ల తేదీల్లో మార్పులు ఉంటాయని చెప్పారు. మండలి కార్యాలయంలో మార్చి 29న వైస్‌ చైర్మన్ ప్రొఫెసర్‌ వి.వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్‌ ఎస్‌.శ్రీనివాస్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోవిడ్‌తో చోటుచేసుకున్న ఆర్థిక నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏ ప్రవేశ పరీక్షకూ ఫీజులు పెంచడం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న ఫీజులే వర్తిస్తాయని చెప్పారు. ఎంసెట్‌ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైందని, లాసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీజీఈ సెట్ల నోటిఫికేషన్లు వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. సెట్‌లకు దరఖాస్తు చేసుకోవడానికి కావల్సిన విద్యార్హతలు, ఇతర వివరాలు నోటిఫికేషన్ లో వెల్లడిస్తామన్నారు. అన్ని పరీక్షలను ఆన్ లైన్ పద్ధతిలోనే నిర్వహిస్తామని తెలిపారు. ఐసెట్‌ నిర్వహణ బాధ్యతను కాకతీయ వర్సిటీకి, ఇతర సెట్ల బాధ్యతను ఉస్మానియా వర్సిటీకి అప్పగించామని చెప్పారు. కాగా జూలై 13న ఈసెట్, జూలై 14 నుంచి 20 మధ్య ఎంసెట్‌ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

చదవండి: 

టీఎస్ ఎంసెట్ స్ట‌డీమెటీరియ‌ర్‌, సిల‌బ‌స్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

టీఎస్ ఎంసెట్: మోడల్ పేపర్లు | ప్రివియస్‌ పేపర్స్ | ప్రాక్టీస్ ప్రశ్నలు

ఏ ‘సెట్‌’ ఎప్పుడు?

పరీక్షలు

తేదీలు

3 ఏళ్ల లాసెట్‌

21–7–22

ఐదేళ్ల లాసెట్‌

22–7–22

పీజీ లాసెట్‌(ఎల్‌ఎల్‌ఎం)

22–7–22

ఎడ్‌సెట్‌ (బీఈడీ కోర్సు కోసం)

26, 27–7–22

ఐసెట్‌ (ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు)

27, 28 –7–22

పీజీసెట్‌ (ఎంటెక్, ఎంఫార్మసీ కోసం)

29–7–22 నుంచి 1–8–22

Published date : 30 Mar 2022 11:39AM

Photo Stories