Skip to main content

PG Medical: కన్వీనర్‌ సీట్ల నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని పీజీ వైద్య విద్య కోర్సుల్లో కన్వీనర్‌ కోటాలో ప్రవేశాలకు ఆన్ లైన్‌ దరఖాస్తుల నమోదుకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నవంబర్‌ 19న నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
PG Medical
పీజీ మెడికల్‌ కన్వీనర్‌ సీట్ల నోటిఫికేషన్ విడుదల

జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్‌– పీజీ–2021లో అర్హత సాధించిన అభ్యర్థులు పీజీ డిప్లొమా/డిగ్రీ సీట్లకు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. కనీ్వనర్‌ కోటాలో సీట్ల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను నవంబర్‌ 20న ఉదయం 8 గంటల నుంచి ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు. నిర్దేశిత దరఖాస్తు పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులు సంబంధిత సరి్టఫికెట్లను స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందన్నారు. ఆన్ లైన్ లో సమర్పించిన దరఖాస్తులు, సర్టిఫికెట్లను యూనివర్సిటీ పరిశీలించిన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తామని చెప్పారు. ప్రవేశాలకు సంబంధించి అర్హత ఇతర సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.inలో సందర్శించాలని సూచించారు. 

చదవండి: 

Good News: నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త

EWS: ఈడబ్ల్యూఎస్‌ కోటా.. ఎంబీబీఎస్‌కు కేటాయించిన సీట్లు సంఖ్య!

NEET-UG 2021: నీట్‌ రాసారా.. ఇది మీ కోసమే!

Published date : 20 Nov 2021 05:50PM

Photo Stories