Central University: ఈ కోర్సులకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష
Sakshi Education
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 2022–23 విద్యా సంవత్సరంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశానికి కేంద్రీయ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీయూఈటీ) నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ తెలిపారు.
జూలై మొదటివారంలో ఈ పరీక్ష ఉంటుందన్నారు. మార్చి 21న ఆయన వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడారు. సెంట్రల్ యూనివర్సిటీల్లోని యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ స్కోర్ తప్పనిసరి అని, ఈ ప్రవేశపరీక్ష ద్వారానే అడ్మిషన్లు కల్పిస్తామని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణ బాధ్యతలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కి అప్పగించినట్టు వివరించారు. ఈ పరీక్షకు క్లాస్–12 ఎన్సీఈఆర్టీ పుస్తకాల నుంచి సిలబస్ ఉంటుందని తెలిపారు. ఈ పరీక్షకు 12వ తరగతి మార్కుల వెయిటేజీ ఉండబోదని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
చదవండి:
ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. యూజీసీ కీలక ప్రకటన. విధివిధానాలు ఇలా..
Professor Jagdish: యూనివర్సిటీలకు అన్నివిధాలా సాయం చేస్తాం
UGC Chairman Interview: తెలుగు రాష్ట్రాల్లో.. విద్యపై ప్రత్యేక దృష్టి
Published date : 22 Mar 2022 01:27PM