Breaking News: ఇకపై డిగ్రీ నాలుగేళ్లు.. యూజీసీ కీలక ప్రకటన. విధివిధానాలు ఇలా..
Sakshi Education
సాక్షి, ఎడ్యుకేషన్: నాలుగేళ్ల డిగ్రీ ప్రొగ్రామ్‌కు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ విద్యా విధానం ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.
Four Years Degree
మార్చి 10వ తేదీన నిర్వహించిన సమావేశంలో నాలుగేళ్ల డిగ్రీ అమలు విధానాన్ని నిర్ణయించారు. 90 రోజుల చొప్పున ఒక్కొక్క సెమిస్టర్ ఉంటుంది. ఇలా మొత్తం 8 సెమిస్టర్లు ఉంటాయి. మొదటి మూడు సెమిస్టర్‌లో మానవీయ శాస్ట్రాలు, సామాజిక శాస్త్రం, గణితం, వృత్తి విద్యకు సంబంధిచినవి చదువుతారు. మూడు సెమిస్టర్లు ముగిసిన తర్వాత ప్రతి విద్యార్థి డిగ్రీలో తన మేజర్, మైనర్ సబెక్ట్‌లు ఎంపిక చేసుకోవాలి. 7,8 సెమిస్టర్లో తాము ఎంచుకున్న సబ్జెక్ట్‌లోని ఏదో ఒక అంశంపై పరిశోధనలు చేయాలి. ఈ ఏడాదే ఢిల్లీ యూనివర్సిటీ ఈ విధానాన్ని అమలుచేయనుంది. మిగతా వర్సిటీలు కూడా త్వరలో అమలు చేయాలని కేంద్రం కోరింది.