Skip to main content

NIT: నిట్‌లో పెరిగిన సీట్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్‌ ఇన్ స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లో ఈ సంవత్సరం 150 సీట్లు పెంచుతూ కేంద్ర ఉన్నత విద్యా శాఖ అనుమతి ఇచ్చింది.
NIT
ఏపీ నిట్‌లో పెరిగిన సీట్లు

ఇప్పటికే 600 సీట్లున్న నిట్‌లో తాజా పెంపు వల్ల 750 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 10 శాతాన్ని ఈడబ్ల్యూఎస్‌ కోటా కింద భర్తీ చేయాలని కేంద్రం ఆదేశించింది. సివిల్‌ ఇంజనీరింగ్‌లో 74 సీట్లను 100కు, కంప్యూటర్‌ సైన్స్ ఇంజనీరింగ్‌లో 114 సీట్లను 150కి, ఈఈఈలో 112 సీట్లను 145కి, ఎలక్ట్రానిక్స్‌ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో 112 సీట్లను 150కి, మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 76 సీట్లను 100కి పెంచారు. మరోవైపు పలు కోర్సుల్లో ఏడు సీట్లను తగ్గించారు. బయోటెక్‌ ఇంజనీరింగ్‌లో 36 సీట్లు ఉండగా ఒక సీటు, కెమికల్‌ ఇంజనీరింగ్‌లో 38 సీట్లకు మూడు, మెటలర్జీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో 38 సీట్లకు మూడు తగ్గించారు. కాగా, నిట్‌లో జోసా కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపునకు సంబంధించి బుధవారం వర్చువల్‌ విధానంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశవ్యాప్తంగా 500 మందికి పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారని నిట్‌ పరిపాలన అధికారి తపస్‌ పర్మాని తెలిపారు.

చదవండి: 

Inter: హాల్ టికెట్లు డౌన్ లోడ్‌ చేసుకోండి.. తప్పులుంటే సవరించుకోండి ఇలా...

Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..!

Published date : 21 Oct 2021 01:20PM

Photo Stories