IIIT: కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
Sakshi Education
ఆరు సంవత్సరాల సమీకృత ఇంజనీరింగ్ విద్యాబోధనకు నిలయమైన ఆంధ్రప్రదేశ్ ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం అక్టోబర్ 12వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్ల కోసం అక్టోబర్ 12, 13 తేదీల్లో ఆయా క్యాంపస్‌లలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలకు 14, 15 తేదీల్లో ఇడుపులపాయలో, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల కోసం 15, 16 తేదీల్లో ఎచ్చెర్ల క్యాంపస్‌లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లతోపాటు వారి సెల్‌ఫోన్‌లకు మెసేజ్‌లు కూడా పంపారు. కౌన్సెలింగ్‌కు ట్రిపుల్ ఐటీల్లో అన్ని ఏర్పాట్లు చేశారు.
చదవండి:
IIIT: తగిన వ్యూహం అనుసరిస్తే సీటు పక్కా..
IIIT-Delhi: క్యాన్సర్ కారకాలను గుర్తించే ఏఐ
AP RGUKT IIIT notification 2022-2023: పదో తరగతితోనే.. బీటెక్
Published date : 11 Oct 2022 01:40PM