Free Coaching: ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణ
Sakshi Education
విద్యారణ్యపురి: తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కలిపి నిర్వహించే కామన్ పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్టు (సీపీజీఈటీ) ఎమ్మెస్సీ కెమిస్ట్రీ ప్రవేశపరీక్షకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం హనుమకొండలోని కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ కళాశాల ప్రి న్సిపాల్ జి రాజారెడ్డి, కెమిస్ట్రీ విభాగం అధిపతి బి రమేష్ తెలిపారు.
చదవండి: Good News For Women Free Training Courses: ఆధార్ కార్డ్ ఉంటే చాలు..మహిళలకు ఉచిత శిక్షణ
ఈ శిక్షణ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో కూడా ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ కళాశాలకు చెందిన విద్యార్థులైనా ఈ శిక్షణను వినియోగించుకోవచ్చునని తెలిపారు. ఏప్రిల్ 17నుంచి ఈ శిక్షణ ప్రారంభించి ఆ ప్రవేశ పరీక్ష వరకు 60 రోజులు కొనసాగిస్తామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు 98669625 89 నంబర్‌లో సంప్రదించాలని వారు తెలిపారు.
Published date : 15 Apr 2024 12:32PM
Tags
- MSc Chemistry Entrance Exam
- Free Coaching
- CPGET 2024
- Kakatiya Government Degree College
- G Raja Reddy
- Telangana News
- Hanamkonda District News
- TS CPGET
- Kakatiya University
- Education
- CPGET preparation
- Telangana Universities
- higher education
- training programme
- Chemistry Department
- sakshieducation latest news
- Free Coaching