ఐటీఐలలో ప్రవేశాల కౌన్సెలింగ్‌కు గడువు పొడిగింపు
విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఐటీఐ వెబ్‌సైట్‌లో స్టూడెంట్ ఏరియాలో విద్యార్థి ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసి ఈ నెల 31వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా సమర్పించాలని సూచించారు. అనంతరం దరఖాస్తు కాపీని ప్రింట్ తీసుకుని విద్యార్థి తన ఒరిజినల్ సర్టిఫికెట్లతో తాము ఎంచుకున్న సంబంధిత ఐటీఐలలో ఆగస్టు 1వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా వెరిఫికేషన్ చేయించుకోవాలని సూచించారు. వెరిఫికేషన్ పూర్తయిన వారు మాత్రమే కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి అర్హులన్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలల్లో 700 సీట్లు, ప్రైవేట్ ఐటీఐలలో 1,712 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అలాగే 10వ తరగతి ఉత్తీర్ణులై ఆ పైన చదువుకుని ఉపాధి కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు కూడా ఈ ప్రవేశాలకు అర్హులని, 8వ తరగతి ఉత్తీర్ణులై 10వ తరగతి అనుత్తీర్ణులైన విద్యార్థులు వెల్డర్ ట్రేడ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఇతర వివరాలకు 08812–230269 నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు.