DEECET 2021: అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రారంభం.. చివరి తేదీ ఇదే..
ఈ జనవరి 20వ తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందని సెట్ కన్వీనర్, ఏపీ మోడల్ స్కూల్స్ కార్యదర్శి కె.రవీంద్రనాధరెడ్డి జనవరి 4న పేర్కొన్నారు. డీఈఈ సెట్–2021లో అర్హత సాధించిన అభ్యర్థులు జనవరి 5 నుంచి 9 వరకు ఆన్ లైన్ లో అప్షన్లను నమోదు చేసుకోవాలన్నారు. అప్షన్లను ’http://apdeecet.apcfss.in, http://cse.ap.gov.in’ వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. సీట్లను జనవరి 10, 11, 12 తేదీల్లో కేటాయిస్తామన్నారు. జనవరి 13న ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్లను విడుదల చేస్తామన్నారు. ప్రభుత్వ డైట్ ప్రిన్సిపాళ్ల పరిశీలన, తుది అలాట్మెంట్ లెటర్లను జనవరి 17 నుంచి 20 వరకు విడుదల చేస్తామని తెలిపారు. జనవరి 31 నుంచి కళాశాలల్లో తరగతులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
చదవండి:
Jobs: టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ షెడ్యూల్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..
KNRUHS: వైద్య విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..
KNRUHS: వైద్య విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్.. చివరి తేదీ ఇదే..