Skip to main content

IIIT: ప్రత్యేక కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఉన్న ప్రత్యేక కేటగిరీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ను డిసెంబర్‌ 12, 13 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు అడ్మిషన్ల కన్వీనర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు డిసెంబర్ ౬న తెలిపారు.
IIIT
ప్రత్యేక కేటగిరీ సీట్ల కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే..

కౌన్సెలింగ్‌ నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్ సీసీ, సైనిక సంతతి కోటా వారికి డిసెంబర్ 12న, క్రీడా, వికలాంగుల కోటా వారికి డిసెంబర్ 13న కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డిసెంబర్ 2వ తేదీతో జనరల్‌ కౌన్సెలింగ్‌ పూర్తికాగా ప్రత్యేక కేటగిరీకి చెందిన 257 సీట్లు అలాగే ఉన్నాయి. ఈ సీట్లకు సంబంధించి సర్టిఫికెట్ల పరిశీలనను నవంబరు నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరిశీలన అనంతరం స్పోర్ట్స్, ఎన్ సీసీ, వికలాంగులు, సైనిక సంతతి కోటాలకు సంబంధించి మెరిట్‌ జాబితాను తయారు చేశారు. ఈ జాబితాను ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.  

చదవండి: 

ఉద్యోగుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్

CPGET: పీజీ సీట్లు తొలిజాబితా విడుదల

Jawad Storm: యూజీసీ నెట్‌ వాయిదా

Published date : 07 Dec 2021 04:17PM

Photo Stories