జవాద్ తుపాను ప్రభావిత రాష్ట్రాల్లో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ –నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ–నెట్)తో పాటు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ)కి సంబంధించిన ప్రవేశ పరీక్ష వాయిదా పడ్డాయి.
జవాద్ తుపాను
ఏపీలోని విశాఖపట్నం, ఒడిశాలోని పూరీ, భువనేశ్వర్, కటక్, బరంపురం, రాయ్‌గఢ్ జిల్లాలోని గునుపూర్‌లోని సెంటర్లలో యూజీసీ–నెట్ 2020, జూన్ 2021 పరీక్షలను రీ షెడ్యూల్ చేశామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) డిసెంబర్ 4న వెల్లడించింది. అలాగే ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ కేంద్రాల్లో, ఒడిశాలోని భువనేశ్వర్, కటక్, సంబాల్‌పూర్ కేంద్రాల్లో, పశి్చమబెంగాల్‌లోని కోల్‌కతా, దుర్గాపూర్‌లోని కేంద్రాల్లో ఐఐఎఫ్‌టీ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) ప్రవేశపరీక్షను వాయిదా వేశారు. ఈ కేంద్రాల్లోని అభ్యర్థులకు త్వరలోనే పరీక్ష తేదీలు ప్రకటిస్తామని ఎన్ టీఏ తెలిపింది.