PGCET 2021: ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం.. రిజిస్ట్రేషన్ కి చివరి తేదీ ఇదే..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ పీజీసెట్)– 2021కు సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైందని కన్వీనర్ ఆచార్య వై. నజీర్‌అహ్మద్ తెలిపారు.
అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ 27 నుంచి జనవరి 2 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులు రూ.500 చొప్పున ఫీజును ఆన్ లైన్ లో చెల్లించి దరఖాస్తును వెబ్‌సైట్‌లో సమర్పించాలన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆన్ లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జనవరి 3 నుంచి 6 వరకు వెబ్‌ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చని తెలిపారు. జనవరి 11వ తేదీన ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులకు సీట్లు కేటాయించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు https://sche.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరారు.
చదవండి:
PGCET: పీజీసెట్ మొదటి ర్యాంకర్లు వీరే..
Published date : 29 Dec 2021 01:33PM