Skip to main content

APRDC CET 2024 Notification: ఏపీ ఆర్‌డీసీసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల.. ప్రవేశ పరీక్ష తేదీ ఇదే..

గుంటూరులోని ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (ఏపీఆర్‌ఈఐఎస్‌).. పల్నాడు జిల్లా నాగార్జునసాగర్‌లోని రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాలలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ(ఇంగ్లిష్‌ మాధ్యమం) మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఏపీ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏపీఆర్‌డీసీ) సెట్‌–2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు(బాలురు) నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Admissions announcement  Application process   Admissions for the academic year 2024-25  AP Residential Degree College Common Entrance Test Set-2024 notification    APRDC CET 2024 Notification   AP Residential Educational Institutions Society

మొత్తం సీట్ల సంఖ్య: 152
గ్రూపు–సీట్లు: బీఏ(హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌)–40 సీట్లు, బీకాం–40 సీట్లు, బీఎస్సీ(మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)–36 సీట్లు, బీఎస్సీ(మ్యాథ్స్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌)–36 సీట్లు.
అర్హత: 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన అర్హత పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 31.03.2024

ప్రవేశ పరీక్ష తేది: 25.04.2024.

వెబ్‌సైట్‌: https://aprs.apcfss.in/

చదవండి: APRJC CET 2024 Notification: ఏపీఆర్‌జేసీ సెట్‌ 2024 నోటిఫికేషన్‌.. పరీక్ష విధానం ఇలా..

Published date : 16 Mar 2024 03:15PM

Photo Stories