విద్యాసంస్థలకు ఏఐసీటీఈ మార్గదర్శకాలు
Sakshi Education
సాక్షి, న్యూఢిల్లీ: మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఆర్టిఫిíషియల్ ఇంటెలిజెన్స్, ఇంజనీరింగ్ రంగంలోని డేటా సైన్స్, లాజిస్టిక్స్, ట్రావెల్ అండ్ టూరిజం విభాగాలకు సంబంధించిన సార్వత్రిక, దూర విద్యతో పాటు విద్యా సంస్థలు, ఆన్‌లైన్ విద్యకు సంబంధించిన మార్గదర్శకాలను ఏఐసీటీఈ గురువారం విడుదల చేసింది.
ఈ విభాగాల్లో అనుసరించాల్సిన కార్యక్రమాలు, పాఠ్యాంశాలు, ప్రవేశాలు, కనీస ప్రమాణాలను ఈ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. శారీరక, బోధనా సౌకర్యాలు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఎంపిక, వారి అర్హతలు నాణ్యమైన బోధనపై సూచనలు చేశారు. డిప్లొమా, పోస్ట్ డిప్లొమా సరి్టఫికెట్, పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్, పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ స్థాయి కార్యక్రమాలకు సంబంధించిన ఇతర మార్గదర్శకాలు, నోటిఫికేషన్లు ఇతర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండొద్దని సూచించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాలు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు వర్తిస్తాయి. న్యాక్ స్కోర్ 3.26 కంటే ఎక్కువగా కానీ, జాతీయ స్థాయిలో టాప్–100 జాబితాలో ఉన్న సంస్థలు సార్వత్రిక, దూరవిద్యతో పాటు ఆన్‌లైన్ విద్యా విధానంలో సూచించిన కోర్సులు ప్రారంభించేందుకు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఏఐసీటీఈ అనుమతి లేని సంస్థలు తక్షణమే బోధన నిలిపేయాలని సూచించారు.
Published date : 05 Mar 2021 05:06PM