Dinesh P Shankar Reddy: విద్యార్థులు విభిన్నంగా ఆలోచించాలి
నిట్‌లో ఏర్పాటుచేసిన రెండు రోజుల టెక్రియ 2023 వేడుకలు నవంబర్ 4న ముగిశాయి. ఈ సందర్భంగా శంకరరెడ్డి మాట్లాడుతూ కొత్త తరహా ఆలోచనా విధానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని, ఇది జీవితంలో ఒక భాగం కావాలని అన్నారు.
ఇలాంటి ఆలోచనా విధానం విద్యార్థుల వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దడంతో పాటు చుట్టుపక్కల ఉన్నవారికి ఒక ధర్మం చూపించే విధంగా ఎదుగుతారని చెప్పారు. వైజ్ఞానిక ప్రాజెక్టుల కోసం శాస్త్రజ్ఞులు ఏళ్లపాటు అంకితభావంతో పనిచేస్తారని అలాంటి వారి స్ఫూర్తితో విద్యార్థులు ప్రయోగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. భిన్నమైన ఆలోచన ధృక్పథంతో చరిత్రలో నిలిచిపోయే ఆవిష్కరణలు ఊపిరిపోసుకుంటాయని వివరించారు.
చదవండి: Dr G Rameswara Rao: చదువుతోపాటు నైపుణ్యం పెంచుకోవాలి
ఆకట్టుకున్న స్టార్టప్ ప్రదర్శనలు
స్టార్టప్ 20 ఎక్స్‌ఫో కార్యక్రమం ఆకట్టుకుంది. జిల్లా లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన 17 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 75 టీములు తమ ప్రాజెక్టులను ప్రదర్శించాయి. 5 ఉత్తమ ప్రాజెక్టుల ను ఎంపి కచేసి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్ర మం డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జీఆర్‌కే శాస్త్రి పర్యవేక్షణలో జరిగింది.
నిట్‌లోని 8 ఇంజినీరింగ్ డిపార్టుమెంట్ల అసోసియేషన్లు, 17 క్లబ్‌ల ఆ ధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శనలు ఏర్పాటు చేశా రు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు వీటిని ఆసక్తితో తిలకించారు. డీన్‌లు, విభాగాధిపతులు, ఆచార్యులు పాల్గొన్నారు.