Engineering: బీటెక్ కోర్సులో రెండో దశ కౌన్సెలింగ్
Sakshi Education
ఇల్లెందు: సింగరేణి ఇల్లెందు ఏరియా ఉద్యోగుల పిల్లలకు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కాకతీయ యూనివర్సిటీ కొత్తగూడెంలో 2023 – 24 విద్యాసంవత్సరం బీటెక్ కోర్సులో ప్రవేశానికి సూపర్ న్యూమరరీ సీట్లకు రెండో దశ కౌన్సెలింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జీఎం జాన్‌ఆనంద్ తెలిపా రు.
సెప్టెంబర్ 3న ఇల్లెందులో ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ సైన్స్ రెండు సీట్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ రెండు సీట్లు మైనింగ్‌లో రెండు సీట్లు, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్‌లో రెండు సీట్లు ఉన్నాయని తెలిపారు. అడ్మిషన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న వారు నేరుగా కౌన్సి లింగ్‌కు హాజరు కావాలని కోరారు. సెప్టెంబర్ 6న కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్వ్యూ లు ఉంటాయని వివరించారు.
చదవండి: ఇంజనీరింగ్ - జాబ్ గైడెన్స్ | ప్రాజెక్ట్ గైడెన్స్ | సక్సెస్ స్పీక్స్ | గెస్ట్ స్పీక్స్ | న్యూస్
Published date : 04 Sep 2023 03:16PM