‘AI’ వల్ల ఉద్యోగాలు ఉంటాయా? ఊడతాయా?.. సత్య నాదెళ్ల ఏమన్నారంటే?
టెక్నాలజీ ఆధారిత నిపుణులతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు సైతం మానవ వినాశనం కోరే కృత్తిమ మేధస్సు వినియోగాల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై స్పందించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ ఎప్పుడైతే చాట్‌జీపీటీ, బార్డ్ వంటి టూల్స్ వినియోగంలోకి వచ్చాయో అప్పటి నుంచి అందరూ దీన్ని నమ్మడం మొదలుపెట్టారు.
చదవండి: Satya Nadella: కృత్తిమ మేధతో కొత్త ఉద్యోగాల కల్పన... అలాగే భారీగా జీతాలు
చాట్‌జీపీటీ వల్ల ఏఐ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసొచ్చింది. దీని వల్ల ఉన్న ఉపయోగాలను పక్కనబెడితే.. వేర్వేరు రంగాలకు చెందిన కోట్లాది మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ తరుణంలో సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో సత్యనాదెళ్ల మాట్లాడుతూ.. ఏఐలాంటి అధునాతన టెక్నాలజీ వినియోగం ఉద్యోగాలపై ప్రభావం ఉంటుంది. అలాగే ఉద్యోగాలకు స్థాన భ్రంశం కలుగుతుంది. అదే సాంకేతికత భవిష్యత్తులో కొత్త ఉద్యోగాలను సృష్టించే సామర్థ్యాన్ని కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని అన్నారు.
చదవండి: IT Jobs: కోడింగ్ రాకపోయిన సాఫ్ట్‌వేర్ జాబ్... ఇలా చేస్తే జాబ్ గ్యారెంటీ
అంతేకాదు మనుషులు రాసిన కంటెంట్‌ని చదవడం, సవరించడం, ఆమోదించడం వంటి విభాగాలకు కొత్త టెక్నాలజీ అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయా రంగాల్లో పనిచేస్తున్న వారికి ఏఐ’ సంతృప్తిని ఇస్తుంది. కొత్త ఉద్యోగాల్ని సృష్టిస్తుంది. ఉత్పాదకత పెరిగి కంపెనీల ప్రణాళికలతో ఉద్యోగుల జీతాలు పెరుగుతాయని చెప్పారు.