Scientist: మెటీరియల్ సైంటిస్ట్ నా లక్ష్యం
మెటీరియల్స్ సైంటిస్ట్‌గా రాణించడమే నా లక్ష్యం. మాది విశాఖపట్నం మా నాన్న చంద్రశేఖర్ యూఎస్‌లో క్రూషిప్పింగ్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మా అమ్మ షర్మిల మ్యాథ్స్ టీచర్. నేను నిట్ వరంగల్‌లో మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ పూర్తి చేసాను. 9.21 సీజీపీఏ సాధించి గోల్డ్‌మెడల్ సాధించడం ఆనందంగా ఉంది. క్యాంపస్ సెలక్షన్స్‌లో రూ.14లక్షల ప్యాకేజీకి వెస్ట్‌బెంగాల్‌లోని వేదాంత్ కంపెనీలో సెలక్ట్ అయ్యాకా కూడా రీసెర్చ్‌పై ఆసక్తితో ఐఐఎస్‌ఈ బెంగళూరులో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను.– తరుణ్ మారెట్ల, మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ గోల్డ్‌మెడల్ విన్నర్
టీచింగ్ అంటే చాలా ఇష్టం
మాది బెంగళూరు. మా నాన్న ఉల్లంఘనాథ్, తల్లి గోమతి. నాన్న కెమికల్ ఇంజనీర్‌గా కొనసాగుతున్నారు. నిట్ వరంగల్‌లో బీటెక్ బయోటెక్నాలజీ విభాగంలో పూర్తి చేశాను. ప్రస్తుతం బెంగళూరులోని ఐఐసీ కళాశాలలో ఎంటెక్ చేస్తున్నాను. నాకు టీచింగ్ చాలా ఇష్టం. విదేశాల్లో పీహెచ్‌డీ పూర్తి చేసి హ్యూమన్ మైక్రో బయోలజీపై పరిశోధనలను చేసి మందులు, యోగా లాంటి వ్యాయామాలు లేకుండా ఆరోగ్యవంతమైన జీవనానికి పరిఽశోధనలు చేస్తా. నిట్‌లో బయోటెక్నాలజీ విభాగంలో 9.75 సీజీపీఏ సాధించి ఇనిస్టిట్యూట్, డిపార్ట్‌మెంట్ గోల్డ్ విన్నర్‌గా నిలవడం ఆనందంగా ఉంది.– నివేదిత ఉల్లంఘనాథ్, బయోటెక్నాలజీ, ఇన్‌స్టిట్యూట్, డిపార్ట్‌మెంట్ గోల్డ్‌మెడల్ విన్నర్
ఎంటర్ ప్రెన్యూర్‌గా రాణించడం లక్ష్యం
నేను స్వయంగా కంపెనీని ప్రారంభించి ఎంటర్ ప్రెన్యూర్‌గా తోటి మిత్రులకు ఉపాధి అవకాశాలను కల్పించడమే నా లక్ష్యం. మా నాన్న కిషోర్‌కుమార్ లైబ్రరేరియన్‌గా, మా తల్లి జ్యోతి టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నేను ప్రస్తుతం ఢిల్లీలోని స్ప్రింకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి రూ.15 లక్షల ప్యాకేజీకి మేనేజింగ్ కన్సల్టెంట్‌గా క్యాంపస్ సెలక్షన్స్‌లో ఎంపికయ్యాను. నిట్ మెకానికల్ విభాగంలో 9.48 సీజీపీఏ సాధించి గోల్డ్‌మెడల్ సాధించడం ఆనందంగా ఉంది.– రేవంత్ చిన్ని, మెకానికల్