Engineering: సెల్ఫ్ రిపోర్టింగ్‌కి చివరీ తెదీ ఇదే..
సీట్లు దక్కే విద్యార్థులు నవంబర్ 27న సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తవుతుందని తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. ఇప్పటివరకూ రెండు దశలుగా కౌన్సెలింగ్ చేపట్టారు. తొలిదశలో 78,270 సీట్లు అందుబాటులో ఉంటే, ఆప్షన్లు ఇచి్చనంత వరకూ 61,169 సీట్లు కేటాయించారు. అయితే తొలి దశలో 46,322 మంది మాత్రమే సెల్ఫ్ రిపోరి్టంగ్ చేశారు. రెండో దఫా కౌన్సెలింగ్‌లో 59,993 సీట్లు కేటాయించారు. ఇందులో కొత్తగా అనుమతి వచి్చన కంప్యూటర్ సైన్స్ గ్రూప్, దాని అనుబంధ కోర్సుల సీట్లు 4 వేలకుపైగా ఉన్నాయి. రెండో దశలో సీట్లు పొందిన వారిలో 53,717 మంది సెల్ఫ్ రిపోరి్టంగ్ చేశారు. ఈ దఫా 6,278 సీట్లు మిగిలాయి. మొత్తంగా 26,073 సీట్లు మిగిలాయి.
నవంబర్ 20, 21న ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్
ఉన్నత విద్యామండలి నవంబర్ 20, 21న ప్రత్యేక రౌండ్ కౌన్సెలింగ్‌కు అనుమతించింది. ఆఖరి దఫా కౌన్సెలింగ్ కావడంతో దాదాపు 25 వేల మంది విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చారు. రెండోదశలో సీట్లు పొందినవాళ్లు మంచి కోర్సులు, కాలేజీల కోసం ఆప్షన్లు ఇచ్చారు. మూడు దశల్లోనూ కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆరి్టఫీషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల సీట్లనే విద్యార్థులు ఎక్కువగా ఎంచుకున్నారు. దీంతో సివిల్ ఇంజనీరింగ్‌లో 3,629, మెకానికల్‌లో 3,980 సీట్లు, ఎలక్రి్టకల్‌లో 3,847 సీట్లు మిగిలాయి. ప్రత్యేక రౌండ్‌లో ఎక్కువ మంది కంప్యూటర్ కోర్సులను మొదటి ఆప్షన్గా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్‌ను పెట్టుకున్నారు. ఈ లెక్కన ఈసారి కూడా సివిల్, మెకానికల్, ఎలక్రి్టకల్ విభాగాల్లో సీట్లు మిగిలిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ వివరాలను కాలేజీలు నవంబర్ 30లోగా ఉన్నత విద్యా మండలికి సమర్పించాల్సి ఉంటుంది.
Also Read