Skip to main content

జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షలు యథాతథం

అనంతపురం: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ పరీక్షలు వాయిదా పడలేదని, ఏప్రిల్‌ 26న యథాతథంగా నిర్వహించామని రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సి.శశిధర్‌ తెలిపారు.
JNTU Anantapur Exams as usual
జేఎన్‌టీయూ అనంతపురం పరీక్షలు యథాతథం

సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేశారనే ప్రచారం పూర్తిగా నిరాధారమన్నారు.  ‘ఈనాడు’లో  తప్పుడు కథనం ప్రచురించడం దారుణమన్నారు. ఏప్రిల్‌ 26న  ఆయన మీడియాతో మాట్లాడుతూ జేఎన్‌టీయూ అనంతపురం నిర్వహించే ఏ పరీక్షనూ ఏప్రిల్‌ 26న  రద్దు చేయటం కానీ, వాయిదా వేయడం కానీ చేయలేదన్నారు. అటానమస్‌ కళాశాలల్లో పరీక్షల సర్దుబాటుకు సంబంధించిన అంశం వర్సిటీ పరిధిలో లేదన్నారు.

చదవండి: Admission: ఇంతలోపు ర్యాంకు వస్తేనే జాతీయ స్థాయి ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రవేశం

ఈనాడు కథనంలో ప్రస్తావించినట్లు ఇంజినీరింగ్‌ నాల్గో సంవత్సరం  సెమిస్టర్‌ పరీక్షలను వాయిదా వేయలేదని చెప్పారు.  జేఎన్‌టీయూఏ ప్రతిష్టను కించపరిచేలా ఈనాడు కథనం ఉందన్నారు.  ఓ కళాశాలలో జరిగిన అంతర్గత పరీక్షల సర్దుబాటును  యూనివర్సిటీకి ఆపాదించడం తగదన్నారు. సీఎం  కార్యక్రమానికి హాజరు కావాలని    ఏ ఒక్క విద్యార్థినీ బలవంతం చేయలేదని స్పష్టం చేశారు.  

చదవండి: IIT Council: ఐఐటీలలో మానసిక ఆరోగ్య సలహాదారులు

Published date : 27 Apr 2023 04:07PM

Photo Stories