IIIT Basara: ట్రిపుల్‌ఐటీ విద్యార్థుల క్షేత్ర పర్యటన
భైంసా – బోధన్ జాతీయ రహదారి నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జాతీయ రహదారి పనులు ఎలా చేపడుతున్నారో చూశారు. సివిల్ ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు బీటీ రోడ్డు నిర్మాణ పద్ధతులు, నాణ్యత గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రిపుల్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ సతీశ్‌కుమార్ మాట్లాడుతూ నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో విద్యార్థుల క్షేత్రస్థాయి పరిశీలన ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
చదవండి: RGUKT Basara: ‘బాసర’ విద్యార్థుల కోసం ఏఐ యాప్
రోడ్డు నిర్మించేప్పుడు ఎంత లోతు తవ్వుతారో... తవ్విన తర్వాత మొరం, కాంక్రీట్ ఏ మోతాదులో వేస్తారో విద్యార్థులు తెలుసుకోగలుగుతారని వివరించారు. కాంక్రీట్ అనంతరం తారు రోడ్డు ఎంత మోతాదులో ఉండాలో కాంక్రిట్‌లో ఎంత మోతాదులో ఏమేమి కలుపుతున్నారో విద్యార్థులు తెలుసుకోగలుగుతారని పేర్కొన్నారు. రహదారులు, వంతెనల నిర్మాణాల్లో తీసుకునే జాగ్రత్తలు తిలకించారు. సివిల్ ఇంజినీరింగ్ విభాగ అధిపతి శాంతిజగదీశ్వరి, అధ్యాపకుడు ఖలీల్, ల్యాబ్ టెక్నీషియన్స్ బలరాం, సుధీర్ పాల్గొన్నారు.