Skip to main content

ఎన్‌బీఏ కాదు ఇఫా! ఇంజనీరింగ్ కాలేజీల గుర్తింపునకు కొత్త కంపెనీ

న్యూఢిల్లీ: ఇకపై ఇంజనీరింగ్ కాలేజీలకు గుర్తింపు, అనుమతులను జాతీయ గుర్తింపు మండలి (ఎన్‌బీఏ) కాకుండా ఐఐటీల ఆధ్వర్యంలో ఏర్పాటైన కొత్త కంపెనీ ఇవ్వనుంది.
ఈ మేరకు ఇటీవలే ఐఐటీ ఫౌండేషన్ ఫర్ అక్రెడిటేషన్ అండ్ అసెస్‌మెంట్ (ఐఎఫ్‌ఏఏ-ఇఫా) ఏర్పాటైంది. ఇందులో వ్యవస్థాపక భాగస్వాములుగా ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ ఖరగ్‌పూర్ ఉంటాయి. ప్రస్తుతం ఈ కంపెనీ సీఈఓ పోస్టు కోసం అభ్యర్థులను వెదుకుతున్నారు. ఐఐటీల్లో పని చేస్తున్న అధ్యాపకులను ఆ పోస్టులో భర్తీ చేసే అవకాశం ఉంది. కంపెనీస్ యాక్ట్ 2013లోని సెక్షన్ 8 ద్వారా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ కంపెనీ ఏర్పాటును ప్రతిపాదించింది. అవసరమైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) వంటి సంస్థల పిలుపు మేరకు ఈ కంపెనీ వారితో కలసి పనిచేస్తుంది. ఇది పూర్తిగా స్వయం ప్రతిపత్తితో నడవనుంది. ఇందులో ఐఐటీలుగానీ, మంత్రిత్వ శాఖలుగానీ జోక్యం చేసుకోలేవు. 
Published date : 21 Oct 2019 03:19PM

Photo Stories