JNTUA: ‘క్యాంపస్’లో కోర్సుల కోత!
బీటెక్‌లో ఏఐ అండ్ ఎంఎల్ కోర్సు లేనట్లే..
జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇప్పటి వరకూ మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్సెస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ కోర్సులు మాత్రమే ఉన్నాయి. వీటికి తోడు ఈ విద్యా సంవత్సరం బీటెక్‌లో కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
చదవండి: Artificial Intelligence: కృత్రిమ మేధతో నవ ప్రపంచం?
ఇందుకు సంబంధించి ఏఐసీటీఈ నుంచి అనుమతి సైతం దక్కించుకున్నారు. అయితే గత పాలకమండలి సమావేశంలో కొత్త కోర్సుల అనుమతి అంశంపై చర్చ సాగినప్పుడు వాటి అమలుకు మండలి సభ్యులు ఆసక్తి కనబరచలేదు. దీంతో గతంలో ఉండే ఆరు బ్రాంచ్‌ల్లోనే ఇంజినీరింగ్ అడ్మిషన్లు చేపట్టనున్నారు.
ఎంటెక్‌లోనూ కోతే..
జేఎన్‌టీయూ (ఏ)ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ కోర్సులో ఇప్పటి వరకూ 24 బ్రాంచ్‌లు ఉన్నాయి. 2024–25 విద్యాసంవత్సరానికి వీటిని 10 బ్రాంచ్‌లకే పరిమితం చేయనున్నారు.
చదవండి: CEO Outlook Pulse: జనరేటివ్ ఏఐపై పోటాపోటీ! సీఈవోలు ఏం చెప్పారంటే..
ప్రస్తుతం స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, పవర్ సిస్టమ్స్, పవర్ అండ్ ఇండస్ట్రీయల్ డ్రైవ్, రెఫ్రిజిరేటర్ అండ్ ఎయిర్ కండీషనర్, డిజిటల్, ఎలక్ట్రికల్ అండ్ సిస్టమ్స్, కంప్యూటర్ సైన్సెస్, నానో టెక్నాలజీ, వీఎల్‌ఎస్‌ఐ అండ్ డిజైన్ కోర్సులతో పాటు తాజాగా సివిల్ ఇంజినీరింగ్‌లో బ్రిడ్జ్ టెక్నాలజీ (బ్రిడ్జి అండ్ టన్నెల్) బ్రాంచ్‌ను అదనంగా ప్రవేశపెడుతున్నారు. కేవలం ఈ పది కోర్సులతోనే క్యాంపస్ కశాశాల కాలం నెట్టుకు రావాల్సి ఉంది. మిగిలిన 14 బ్రాంచ్‌లకు కోత పెట్టారు.
కోర్సుల అమలుతో మెరుగైనఉపాధి అవకాశాలు
అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి దక్కించుకున్న జేఎన్‌టీయూ(ఏ)ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేయాలనే ఆకాంక్ష ఎంతో మంది విద్యార్థులకు ఉంది. ఏపీ ఈఏపీసెట్‌లో(గతంలో ఎంసెట్) గణనీయమైన ర్యాంకులు దక్కిన వారికే జేఎన్‌టీయూ క్యాంపస్ కళాశాలలో సీటు దక్కే పరిస్థితి ఉంది.
ఈ కళాశాలలో ఇంజినీరింగ్ అడ్మిషన్లకు భారీగా డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఈఏపీసెట్‌లో అత్యుత్తమ ర్యాంకు వచ్చే విద్యార్థులు మొదట ఆప్షన్ ఇస్తుండడంతో అత్యుత్తమ ర్యాంకర్లకే సీట్లు వస్తున్నాయి. ఏటా క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా పేరెన్నిక గల బహుళజాతి సంస్థల్లో 300 మందికి పైగా విద్యార్థులు కొలువులు దక్కించుకుంటున్నారు. దీంతో ఈ కళాశాలలో సీటు హాటుకేక్‌గా మారింది.
చదవండి: Placement Job for Student: ఇంజనీరింగ్ విద్యార్థినికి ప్లేస్మెంట్లో ఉద్యోగం.... ప్యాకేజీ ఎంత?
ఈ క్రమంలో అదనంగా బీటెక్‌లో బ్రాంచ్ ఏర్పడితే గొప్ప సదావకాశంగా భావిస్తారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, కంప్యూటర్ సైన్సెస్ విభాగంలో మొత్తం 360 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయి. తాజాగా కొత్త బ్రాంచ్ ఏర్పడితో మరో 60 ఇంజినీరింగ్ సీట్లు వస్తాయి. ప్రస్తుత మార్కెట్‌లో ఎంతో డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ కళాశాలలో ప్రవేశపెడితే అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లా విద్యార్థులకు గొప్ప అవకాశం దక్కినట్లే. ఈ నేపథ్యంలో జేఎన్‌టీయూ (ఏ) ఉన్నతాధికారులు పునరాలోచించి బీటెక్‌లో అదనపు బ్రాంచ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.
పరిశీలిస్తాం
జేఎన్‌టీయూ (ఏ)క్యాంపస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సు ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ఉంది. దీనిని పరిశీలిస్తాం. 2023–24 విద్యా సంవత్సరంలో ఎంటెక్‌లో బ్రిడ్జ్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టాం. కొత్త కోర్సులకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదన రాలేదు. ఎంటెక్ కోర్సులు తగ్గించాం.
– ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రిన్సిపాల్, జేఎన్‌టీయూ(ఏ) క్యాంపస్ కళాశాల