JOSSA: కేంద్ర ఇంజనీరింగ్ సంస్థల్లో సీట్ల కేటాయింపు.. కేటాయింపులో కటాఫ్ ఇలా..
ప్రతిష్టాత్మక IITలు, NITలు, కేంద్ర నిధులతో నడిచే సంస్థల్లో ర్యాంకుల వారీగా సీట్లను కేటాయించింది. విద్యార్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా ఏ సంస్థలో సీటు వచ్చిందనే వివరాలు తెలుసుకునే వీలు కల్పించింది. దేశవ్యాప్తంగా ఈసారి అడ్వాన్స్‌డ్‌లో 43 వేల మంది అర్హత సాధించారు. వీరికి ఐఐటీల్లో ర్యాంకు ఆధారంగా సీట్లు కేటాయించారు. జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల్లో సీట్లు కేటాయించారు. తొలి దశ సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 26 లోగా ఆన్‌లైన్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, జీఎఫ్‌ఐటీల్లో 54,477 ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. వీరిలో 2,971 సీట్లు మహిళలకు సూపర్ న్యూమరరీ పోస్టులుగా కేటాయించారు. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో ఈ సారి 16,598 సీట్ల లభ్యత ఉంది. ఇందులో మహిళలకు 1,567 సీట్లున్నాయి. వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం జోసా కౌన్సెలింగ్‌లోనూ కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు కన్పించింది. అయితే, ఏ కాలేజీలో కటాఫ్ ఎంత అనేది ఇంకా వెల్లడించలేదు. మరో ఐదు రౌండ్లు కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది.
చదవండి: Social Sector Jobs: కార్పొరేట్ జాబ్స్ వదిలి.. సోషల్ సెక్టార్ వైపు అడుగులు వేస్తున్న యువత!
ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో జోసా కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపులో కటాఫ్ ఇలా..
ఐఐటీ |
బాలురు |
బాలికలు |
బొంబాయి |
60 |
305 |
కాన్పూర్ |
295 |
873 |
ఢిల్లీ |
102 |
450 |
మద్రాస్ |
167 |
588 |
హైదరాబాద్ |
585 |
1,505 |
తిరుపతి |
3,746 |
5,501 |
రూర్కీ |
408 |
1,438 |
పాలక్కడ్ |
4,450 |
7,063 |
భిలాయ్ |
4,928 |
8,462 |
ఎన్‌ఐటీలు |
బాలురు |
బాలికలు |
వరంగల్ |
1,664 |
3,593 |
తిరుచనాపల్లి |
759 |
1,260 |
సూరత్‌కల్ |
1,083 |
2,197 |
కాలికట్ |
3,843 |
4,636 |
ఆంధ్రప్రదేశ్ |
16,039 |
17,873 |
జలంధర్ |
8,553 |
13,777 |