Skip to main content

Engineering: ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వివరాలు..

ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్‌ కోటా కింద మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది.
Engineering
ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వివరాలు..

తొలి దశలో 61,169 సీట్లు ఎంసెట్‌ అర్హులకు కేటాయించినట్టు తెలంగాణ సాంకేతిక విద్య కమిషనర్‌ నవీన్ మిట్టల్‌ సెప్టెంబర్‌ 18న ఓ ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్‌ 23వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్‌ రిపోరి్టంగ్‌ చేయాలని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల ఫీజుల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల కోసం మొత్తం 71,216 మంది సరి్టఫికెట్‌ వెరిఫికేషన్ కు హాజరయ్యారు. 69,793 మంది వెబ్‌ ఆపన్స్ నమోదు చేశారు. అయితే ఇంజనీరింగ్‌ విభాగంలో 15 ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీ కళాశాలలు, 158 ప్రైవేటు కాలేజీలతో కలిపి మొత్తం 175 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 74,071 సీట్లున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్‌ ద్వారా 60,941 సీట్లు (82.27 శాతం) భర్తీ చేశారు. ఫార్మసీలో 115 కాలేజీల్లో 4,199 సీట్లు అందుబాటులో ఉంటే 228 సీట్లను భర్తీ చేశారు. ఈడబ్ల్యూస్‌ కోటా కింద తొలిదశలో 5,108 సీట్లు (ఇంజనీరింగ్, ఫార్మా) కేటాయించారు. 

Published date : 20 Sep 2021 04:38PM

Photo Stories