Skip to main content

ఈఏపీ సెట్‌ బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తుల స్వీకరణ తేదీ ఇదే..

ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఈఏపీ సెట్‌ అడ్మిషన్లలో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ కోసం సెప్టెంబర్‌ 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి కార్యదర్శి నజీర్‌ అహమ్మద్‌ సెప్టెంబర్‌ 26న ఓక ప్రకటనలో తెలిపారు.
Acceptance of applications for EAPCET B category seats
ఈఏపీ సెట్‌ బీ కేటగిరీ సీట్లకు దరఖాస్తుల స్వీకరణ తేదీ ఇదే..

అభ్యర్థులు ‘https://cets.apsche.ap.gov.in/APSCHEHome.aspx’ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చని, లేదా ఆయా కాలేజీలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయా కాలేజీలు సెప్టెంబ‌ర్‌ 27న నోటిఫికేషన్లు జారీ చేస్తాయని, అక్టోబర్‌ 10 వరకు దరఖాస్తుకు గడువు ఉంటుందని, 14న మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయాల్సి ఉందని వివరించారు.

 AP & TS College Predictor 2022 (EAMCET | ICET | POLYCET)

Published date : 27 Sep 2022 02:44PM

Photo Stories