Skip to main content

TSCHE: ఎడ్‌సెట్‌లో 98.18 శాతం అర్హత.. టాపర్స్‌ వీరే...

సాక్షి, హైదరాబాద్, తాండూరు టౌన్‌: వివిధ యూనివర్సిటీల పరిధిలోని రెండేళ్ళ బీఈడీ కోర్సులో ప్రవేశానికి గత నెల నిర్వహించిన తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలను ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి జూన్‌ 12న హైదరాబాద్‌లో విడుదల చేశారు.
TSCHE
ఎడ్‌సెట్‌లో 98.18 శాతం అర్హత.. టాపర్స్‌ వీరే...

ఇందులో 98.18 శాతం మంది అర్హత సాధించినట్టు ఆయన ప్రకటించారు. అర్హత పొందిన వారిలో చాలా మందికి సీటు లభించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 18,350 బీఈడీ సీట్లున్నాయని, గత ఏడాది 13,756 మంది మాత్రమే చేరారని లింబాద్రి వివరించారు. ఈ ఏడాది ఎడ్‌సెట్‌కు 31,725 మంది రిజిస్టర్‌ చేసుకోగా, 27,495 మంది పరీక్ష రాశారని, వీరిలో 26,994 మంది అర్హత సాధించారని వివరించారు. ఎడ్‌సెట్‌లోనూ మహిళలదే పైచేయి కావడం విశేషమన్నారు. బాలురు 5,059 మంది అర్హత పొందితే, బాలికలు 21,935 మంది ఎడ్‌సెట్‌లో క్వాలిఫై అయినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు 25 శాతం, ఇతరులకు 38 శాతంగా నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. మొత్తం 150 మార్కులకు పరీక్ష జరిగిందనీ త్వరలోనే ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ చేపడతామని చెప్పారు.

చదవండి: AP EDCET 2023: బీఏ (ఓఎల్‌) విద్యార్థులకు బీఈడీ అవకాశం

తాండూరు విద్యార్థినికి ఫస్ట్‌ ర్యాంక్‌  

ఎడ్‌సెట్‌లో తాండూరు పట్టణం గ్రీన్‌సిటీకి చెందిన విద్యార్థిని గొల్ల వినీష స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించింది. 150 మార్కులకు గాను 117.4 మార్కులు (హాల్‌ టికెట్‌ నంబర్‌ 2335105050) సాధించి స్టేట్‌ టాపర్‌గా నిలిచింది. స్థానిక సింధూ డిగ్రీ కళాశాలలో ఎంపీసీ (కంప్యూటర్‌ సైన్స్‌) తృతీయ సంవత్సరం చదువుతోంది. కూతురుకు స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంకు రావడంపై తండ్రి మొగులప్ప( ప్రభుత్వ ఉపాధ్యాయుడు) సంతోషం వ్యక్తం చేశారు. తనకు టీచర్‌ వృత్తి అంటే చాలా ఇష్టమని ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం ఆనందంగా ఉందని వినీష తెలిపింది. 

టాపర్స్‌ వీరే... 

పేరు

జిల్లా

మార్కులు

గొల్ల వినీషా

వికారాబాద్‌

117.453624

నిషాకుమారి

హైదరాబాద్‌

117.011152

ఎం. సుషీ

హైదరాబాద్‌

114

విశాల చంద్రశేఖర్‌

జగిత్యాల

113

ఆకోజు తరుణ్‌చంద్‌

పెద్దపల్లి

112.389165

తంపుల ప్రశాంత్‌

ఆదిలాబాద్‌

112.382837

మహ్మద్‌ షరీఫ్‌

రంగారెడ్డి

111

కుసుమ వినయ్‌కుమార్‌

కోనసీమ, ఏపీ

110.825309

ఎం. అరుణ్‌కుమార్‌

ములుగు

110.289165

ఎ. లక్ష్మీ గాయత్రి

హైదరాబాద్‌

110.389165 

ఎడ్సెట్ అభ్యర్థుల అర్హత ఇలా...

 

పురుషులు

మహిళలు

మొత్తం

దరఖాస్తులు

6009

25716

31725

పరీక్ష రాసింది

5095

22400

27495

అర్హత సాధించింది

5059

21935

26994

అర్హత శాతం

99.29

97.92

98.18

Published date : 13 Jun 2023 04:45PM

Photo Stories