EDCET 2023: నేడు ఎడ్‌సెట్.. మొదటిసారి పరీక్ష నిర్వహన ఇలా..
పరీక్ష కోసం 31,725 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 49 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మహాత్మాగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, ఎడ్‌సెట్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, కన్వీనర్ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 వరకు రెండో సెషన్, సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకూ మూడో సెషన్ జరగనుందన్నారు.
చదవండి: ఇక తెలంగాణ ఎడ్‌సెట్‌లో అన్ని సబ్జెక్టులకు ఒకే ప్రశ్నపత్రం..!
మొదటిసారి కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 18న ఉదయం 9గంటలకు ఎంజీయూలో ప్రశ్నపత్రం కోడ్ విడుదల చేస్తామన్నారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి 90 నిమిషాల ముందు రావాలని, కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం థర్మల్ స్క్రీనింగ్ చేస్తారని ఆయన తెలిపారు.
చదవండి: బీఎడ్ అన్నికోర్సులకు కామన్ పరీక్ష: ఇక మీదట ఎలా ఉండబోతుందంటే..