Skip to main content

AP EDCET 2022 Admissions : ఏపీ ఎడ్‌సెట్‌ మొదటి విడత అడ్మిషన్లకు షెడ్యూల్‌ విడుదల.. సీట్ల కేటాయింపు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని బీఈడీ, స్పెషల్ బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాసిన ఏపీ ఎడ్‌సెట్ మొదటి విడత అడ్మిషన్లకు అక్టోబ‌ర్ 20వ తేదీన (గురువారం) షెడ్యూల్‌ విడుదలైంది.

ఏపీ ఎడ్‌సెట్‌ అడ్మిషన్ల కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే రామమోహన్ రావు షెడ్యూల్‌ వివరాలను వెల్లడించారు. ఎడ్‌సెట్‌ ఫస్ట్‌ ఫేజ్‌ అడ్మిషన్లకు అక్టోబ‌ర్ 21వ తేదీన (శుక్రవారం) నోటిఫికేషన్‌ విడుదల కాన్నట్లు తెలిపారు.

AP EDCET 2022: ఉపాధ్యాయ వృత్తికి మార్గం.. ఎడ్‌సెట్‌

అక్టోబ‌ర్ 22వ తేదీ నుంచి 27 వరకు వెబ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపట్టగా.. 26 నుంచి 31 వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుందని తెలిపారు. స్పెషల్ కేటగిరీ విద్యార్థులకు ఈ నెల 27న విజయవాడ లయోలా కాలేజ్‌లో సర్టిఫికేట్లు పరిశీలించన్నట్లు పేర్కొన్నారు.

సీట్ల కేటాయింపు తేదీ ఇదే..
నవంబర్ ఒకటి నుంచి మూడు వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇవ్వగా.. నవంబర్ మూడో తేదీన వెబ్ ఆప్షన్లలో మార్పుకి అవకాశం కల్పించారు. ఇక నవంబర్ 5న విద్యార్ధులకు సీట్ల కేటాయించనున్నారు. నవంబర్ 7నుంచి 9లోపు కళాశాలలో చేరేందుకు విద్యార్ధులకు అవకాశం కల్పించారు. నవంబర్ 7 నుంచి తరగతులు ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.

AP Edcet 2022
Published date : 20 Oct 2022 06:10PM

Photo Stories