Skip to main content

వెబ్‌సైట్లో టీఎస్ ఎంసెట్-2019 హాల్‌టికెట్లు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఎంసెట్-2019 పరీక్ష హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభమైనట్లు టీఎస్ ఎంసెట్ కన్వీనర్ యాదయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఏప్రిల్ 20న ఉదయం 8 నుంచి మే 1 సాయంత్రం వరకు హాల్‌టికెట్లను ‘https://https://eamcet.tsche.ac.in’ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. హాల్‌టికెట్లపై ఉన్న పరీక్ష కేంద్రం చిరునామా ఆధారంగా అభ్యర్థులు చిరునామాను సరిచూసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున టీఎస్ ఎంసెట్‌ను హైదరాబాద్ జేఎన్టీయూ నిర్వహిస్తోంది. మొత్తం 18 చోట్ల ఎంసెట్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, తెలంగాణలో 15, ఆంధ్రాలో మూడు చోట్ల పరీక్ష నిర్వహిస్తున్నారు. మే 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, మే 8, 9 తేదీల్లో వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో నిర్వహిస్తారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 వరకు పరీక్ష నిర్వహిస్తారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,41,716 మంది, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 76,646 మంది, రెండు విభాగాల్లో ఉమ్మడిగా 234 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

టీఎస్ ఎంసెట్-2019 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
Published date : 22 Apr 2019 03:25PM

Photo Stories