Skip to main content

వెబ్‌సైట్లో ఏపీ ఎంసెట్-2019 హాల్‌టికెట్లు

సాక్షి, స్టూడెంట్ ఎడిషన్: ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ’ఏపీ ఎంసెట్’ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏప్రిల్ 16న అధికారిక వెబ్‌సైట్ ఉంచింది.
’ఏపీ ఎంసెట్-2019’కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.in నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, క్వాలిఫైయింగ్ పరీక్ష హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 19 వరకు దరఖాస్తుకు గడువు : ఈ ఏడాది ఎంసెట్ పరీక్షలకు దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఎంసెట్ దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ.. అభ్యర్థులకు ఇప్పటికీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు రూ.10,000 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అన్ని పరీక్షలు ఆన్‌లైన్‌లోనే..: షెడ్యూలు ప్రకారం ఎంసెట్ పరీక్షలన్నీ ఈసారి కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ పరీక్ష ఏప్రిల్ 20 నుంచి 23 వరకు; అగ్రికల్చర్ విభాగానికి ఏప్రిల్ 23, 24 తేదీల్లో; రెండు విభాగాలు రాసేవారికి ఏప్రిల్ 22, 23 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తారు. రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ ఉంటుంది.

ఏపీ ఎంసెట్-2019 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
Published date : 17 Apr 2019 02:15PM

Photo Stories