TS EAPCET 2024: ఇకపై ఎంసెట్.. టీఎస్‌ఈఏపీసెట్.. పేరు మార్చిన ఉన్నత విద్యామండలి..
రాబోయే 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించిన వివిధ కోర్సుల్లో ప్రవేశం నిమిత్తం నిర్వహించే పరీక్షల తేదీలు, వాటిని నిర్వహించే విశ్వవిద్యాలయాల వివరాలను వెల్లడించింది. రాష్ట్రంలో గతంలో టీఎస్ ఎంసెట్‌గా ఉన్న పేరును గత కొంతకాలంగా విడిగా నీట్ ద్వారా మెడిసిన్ ప్రవేశాలను నిర్వహిస్తుండడంతో టీఎస్‌ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులిచ్చింది.
> College Predictor - 2023 AP EAPCET | TS EAMCET
జనవరి 25న ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్‌సీహెచ్‌ఈ చైర్మన్ ప్రొ. ఆర్, లింబాద్రి షెడ్యూల్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో... టీఎస్‌సీహెచ్‌ఈ వైస్ చైర్మన్ ప్రొ. ఎస్కే మహమూద్, జేఎన్‌టీయూ–హెచ్ వీసీ ప్రొ. కట్టా నర్సింహారెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.డి.రవీందర్, కాకతీయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొ.టి.రమేశ్ పాల్గొన్నారు.
ఈ ప్రవేశపరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు ..షెడ్యూల్, దరఖాస్తు చేసుకునేందుకు అర్హతలు, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ పీజు తదితరాల గురించి సంబంధించి సెట్ కన్వీనర్లు ప్రకటిస్తారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎన్.శ్రీనివాసరావు తెలిపారు.
> Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh | Telangana
ఈ ఎనిమిది ప్రవేశపరీక్షలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షల (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు) టీఎస్ సెట్‌ల తేదీలు, నిర్వహించే యూనివర్సిటీల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి....
టీఎస్ సెట్స్–2024 |
నిర్వహించే వర్సిటీ |
పరీక్ష తేదీ/ తేదీలు |
టీఎస్ ఈ సెట్–2024 |
ఉస్మానియా విశ్వవిద్యాలయం |
06–05–2024(సోమవారం) |
టీఎస్ ఈఏపీసెట్–2024 |
జేఎన్‌టీయూ–హెచ్ |
09–05–2024 నుంచి 11–05–2024 |
అగ్రికల్చర్, ఫార్మసీ |
జేఎన్‌టీయూ–హెచ్ |
12–05–2024 (ఆదివారం), 13–05–2024 (సోమవారం) |
టీఎస్ ఎడ్.సెట్–2024 |
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం |
23–05–2024 (ఆదివారం) |
టీఎస్ లాసెట్–2024 |
ఉస్మానియా విశ్వవిద్యాలయం |
03–06–2024 (సోమవారం) |
టీఎస్ పీజీఎల్‌సెట్ (ఎల్‌ఎల్‌ఎం కోర్సులు) |
ఉస్మానియా విశ్వవిద్యాలయం |
03–06–2024 (సోమవారం) |
టీఎస్‌ఐసెట్–2024 |
కాకతీయ విశ్వవిద్యాలయం |
04–06–2024 , 05–06–2024 |
టీఎస్ పీజీఈసెట్–2024 |
జేఎన్‌టీయూ–హెచ్ |
06–06–2024 నుంచి 08–06–2024 |
టీఎస్ పీఈసెట్–2024 |
శాతవాహన విశ్వవిద్యాలయం |
10–06–2024 నుంచి 13–06–2024 |