TSCHE: ఎంసెట్ షెడ్యూల్ వివరాలు
దీంతోపాటు ఈ–సెట్, ఐ–సెట్, పీజీ సెట్, ఎడ్‌సెట్ షెడ్యూళ్లను కూడా ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. 2023–24 విద్యా సంవత్సరానికిగాను ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్‌పై విద్యార్థులు ఆసక్తితో ఉన్నారు. ఇప్పటికే జాతీయస్థాయి ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశపరీక్ష జేఈఈ తొలివిడత పూర్తయింది.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
రెండోవిడత ఏప్రిల్‌లో జరుగుతుంది. ఈలోగా ఇంటర్ పరీక్షలు పూర్తవుతాయి. ఎంసెట్ షెడ్యూల్ ఇచ్చిన తర్వాత పరీక్షకు 45 రోజుల గడువు ఉండాలని మండలి నియమంగా పెట్టుకుంది. ఈ కారణంగా ఏప్రిల్ చివరివారం లేదా మే మొదటివారంలో పరీక్ష ఉండొచ్చని అధికార వర్గాలు తెలిపాయి. ఇంటర్ వెయిటేజీ దాదాపు ఉండనట్టేనని అధికారులు చెబుతున్నారు.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS