EAMCET 2023: నోటిఫికేషన్ ఇవ్వొచ్చు
ఎంసెట్ సమగ్ర నోటిఫికేషన్ ఇవ్వడానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఆమె స్పష్టం చేశారు. మే 7 నుంచి ఎంసెట్ పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి ఇప్పటి వరకూ దరఖాస్తు తేదీ, ఇతర వివరాలతో కూడిన సమగ్ర నోటిఫికేషన్‌ను మాత్రం ఇవ్వలేదు. ఇంటర్ సెకెండియర్ రాసే విద్యార్థులే ఎంసెట్ రాస్తారు. ఈ నేపథ్యంలో ప్రతీ సంత్సరం ఇంటర్ బోర్డ్ విద్యార్థుల డేటా, హాల్ టిక్కెట్ల వివరాలను ఎంసెట్ విభాగానికి పంపుతుంది.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
దీన్ని ఫీడ్ చేసిన తర్వాతే ఎంసెట్ వెబ్‌సైట్ పనిచేసేలా చేస్తారు. అయితే, ఇప్పటి వరకూ హాల్ టిక్కెట్ల వివరాలు రాలేదని, అందుకే నోటిఫికేషన్ జాప్యం అవుతోందని మండలి వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బోర్డ్ వర్గాలు మాత్రం త్రోసిపుచ్చుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇంటర్ బోర్డ్ హాల్ టిక్కెట్లు రాకపోయినా ఈ నెలాఖరులోగా ఎంసెట్ సమగ్ర నోటిఫికేషన్ విడుదల చేస్తామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు.