TSCHE: తెలంగాణ ఎంసెట్ ప్రారంభం.. ఈ సారి పరీక్ష ఇలా..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, వైద్య, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష టీఎస్ ఎంసెట్–2023 మే 10 నుంచి జరగనున్నాయి.
10, 11 తేదీల్లో అగ్రి, మెడికల్, 12 నుంచి 14 వరకూ ఇంజనీరింగ్ ఎంసెట్ నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఒక దఫా, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ రెండో సెషన్ పరీక్ష ఉంటుంది. ఈ సారి మొత్తం మూడు లక్షలకుపైగా విద్యార్థులు ఎంసెట్ రాయనుండగా...ఇందుకోసం తెలంగాణలో 104, ఏపీలో 33 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
చదవండి: ఎంసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్
పరీక్షల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించినట్లు అధికారులు తెలిపారు. నిర్ణీత సమయానికి ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరని అధికారులు స్పష్టం చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని, విజయం సాధించాలని జేఎన్‌టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి విద్యార్థులను కోరారు.
Published date : 10 May 2023 03:33PM