అగ్రికల్చర్, వైద్య కోర్సుల్లో ప్రవేశానికి జేఎన్‌టీయూహెచ్ నిర్వహించిన రెండు రోజుల ఎంసెట్ జులై 31తో ముగిసింది.
TS EAMCET 2022 Agri EAMCET
రెండు రోజుల్లో 85.3 శాతం మంది విద్యార్థులు హాజరైనట్టు ఎంసెట్ కనీ్వనర్ ప్రొఫెసర్ గోవర్థన్ తెలిపారు. ఈ ఎంసెట్ కోసం మొత్తం 94,476 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పరీక్షకు 80575 మంది హాజరయ్యారు. పరీక్ష కీని మూడు రోజుల్లో విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఆగస్టు రెండో వారంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యే వీలుంది.