Skip to main content

TS EAMCET-2021 Results: తెలంగాణ ఎంసెట్–2021 ఫలితాలు విడుదల

సాక్షి ఎడ్యుకేషన్, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్–2021 ఫలితాలు(TS EAMCET Result 2021) విడుదల అయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగస్టు 25వ తేదీన ఉదయం 11:00 గంటలకు కూకట్‌పల్లిలోని జేఎన్టీయూహెచ్‌ క్యాంపస్‌లో ఎంసెట్‌ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఎంసెట్‌కు ద‌ర‌ఖాస్తు చేసిన వారిలో ఇంజనీరింగ్ ప్రవేశ ప‌రీక్షకు 90 శాతం మంది, అగ్రికల్చర్ & మెడికల్ ఎంట్రెన్స్‌కు 91.19 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కాగా, ఈ 2021 ఏడాది ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం 45 శాతం మార్కుల నిబంధనను ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఇక ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మొదటి విడత ఆగ‌స్టు 30న ప్రారంభమవ‌నుంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆగ‌స్టు 30 నుంచి సెప్టెంబర్‌ 9 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్‌ చేసుకోవాలని అధికారులు తెలిపారు.


ఇంజనీరింగ్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి
అగ్రికల్చర్, మెడికల్‌ ఫలితాల కోసం క్లిక్‌ చేయండి
Published date : 25 Aug 2021 11:12AM

Photo Stories