Skip to main content

Telangana EAMCET Results: ఇంజనీరింగ్‌లో అర్హులు.. 82.08%

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఎంసెట్‌ ఫలితాలను విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విడుదల చేశారు.
ఇంజనీరింగ్‌ విభాగంలో 82.08 శాతం.. అగ్రికల్చర్, మెడికల్‌ విభాగంలో 92.48 శాతం అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌లో మొదటి పది మందిలో 9 మంది.. మెడికల్, అగ్రికల్చర్‌లో టాప్‌టెన్‌లో 8 మంది బాలురే. ఇంజనీరింగ్‌ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఆరింటిని ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులే కైవసం చేసుకోవడం విశేషం. అగ్రికల్చర్, మెడికల్‌ విభాగంలోనూ ఆ రాష్ట్రానికి టాప్‌ టెన్‌లో నాలుగు దక్కాయి. ఇదిలా ఉండగా, హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలకు చెందిన విద్యార్థులే ఎంసెట్‌ మొదటి పది ర్యాంకుల్లో ఎక్కువగా ఉన్నారు. ఇంటర్మీడియేట్‌ మార్కులను ఈసారీ వెయిటేజ్‌గా తీసుకోలేదు. ఇంటర్‌ సబ్జెక్టుల్లో కనీస మార్కుల అర్హత నిబంధనను ఎత్తివేశారు. ఎస్సీ, ఎస్టీలు మినహా కటాఫ్‌ మార్క్‌ 40గా నిర్ణయించారు.

అంతా ఆన్‌లైన్‌లోనే..
రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు.. జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నికల్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ (జేఎన్‌టీయూహెచ్‌) సంయుక్త భాగస్వామ్యంతో ఎంసెట్‌ నిర్వహించారు. బీటెక్‌ కోర్సు ల్లో ప్రవేశానికి పరీక్ష ఈ నెల 4, 5, 6 తేదీల్లో... వ్యవసాయ, నర్సింగ్‌ వంటి మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష 9, 10 తేదీల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో జరిగింది. ఇంజనీరింగ్‌ ఎంసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో 89.71 శాతం, మెడికల్, అగ్రికల్చర్‌లో 91.19 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.

‘సెట్‌’లో తెలంగాణనే ముందంజ: సబిత
కోవిడ్‌ కష్టకాలంలోనే ఎంసెట్‌ నిర్వహించి, అన్ని రాష్ట్రాలకన్నా తెలంగాణనే ముందు వరుసలో ఉందని సబితా ఇంద్రారెడ్డి ఫలితాల వెల్లడి సందర్భంగా అన్నారు. గత మూడేళ్ల లెక్కను పరిశీలిస్తే.. ఈసారి ఎంసెట్‌కు 28 వేల మంది విద్యార్థులు అధికంగా హాజరయ్యారని తెలిపారు. విద్యా ప్రమాణాల మెరుగుకు ఇదే నిదర్శనమన్నారు. తెలంగాణ విద్యార్థులు ప్రతిభతో మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూహెచ్‌ వీసీ కట్టా నర్సింహారెడ్డి, ఎంసెట్‌ కన్వీనర్‌ గోవర్థన్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ లింబాద్రి, మాజీ చైర్మన్‌ పాపిరెడ్డి
తదితరులు పాల్గొన్నారు.

అర్హత ఇలా...
ఇంజనీరింగ్‌లో...
ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నవారు : 1

64

963

పరీక్షకు హాజరైనవారు : 1

47

991

అర్హత పొందినవారు : 1

21

480


అగ్రికల్చర్, మెడికల్‌...
దరఖాస్తులు చేసుకున్నవారు : 86

641

పరీక్షకు హాజరైనవారు : 79

009

అర్హత సాధించినవారు : 73

070


టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..
ఇంజనీరింగ్‌లో..

విద్యార్థి

జిల్లా

మార్కులు

సత్తి కార్తికేయ

పాలకొల్లు(పశ్చిమగోదావరి)

158

దుగ్గినేని వెంకట ప్రణీత్‌

రాజంపేట(కడప)

156

మహ్మద్‌ అబ్దుల్‌ ముఖీత్‌

టోలిచౌకి, హైదరాబాద్‌

156

రామస్వామి సంతోష్‌రెడ్డి

పోచంపల్లి, నల్లగొండ

154

జోష్యుల వెంకట ఆదిత్య

హైదర్‌నగర్, హైదరాబాద్‌

154

పి. చేతన్‌ మనోజ్ఞసాయి

పీలేరు, చిత్తూరు

154

ఎం. ప్రణయ్‌

విజయనగరం

153

దేశాయి సాయి ప్రణవ్‌

నెల్లూరు

152

ఎస్‌. దివాకర్‌సాయి

విజయనగరం

152

ఎస్‌. సాత్విక రెడ్డి

నల్లగొండ

152


అగ్రికల్చర్, మెడికల్‌...

విద్యార్థి

జిల్లా

మార్కులు

మండవ కార్తికేయ

బాలానగర్, హైదరాబాద్‌

151

ఈమని శ్రీనిజ

పెద్దఅంబర్‌పేట, హైదరాబాద్‌

150

టీ సాయి కౌశల్‌ రెడ్డి

హైదరాబాద్‌

150

రంగు శ్రీనివాస కార్తికేయ

అనంతపురం, ఏపీ

150

చందం విష్ణు వివేక్‌

రాజమండ్రి, ఏపీ

149

కోలా పవన్‌ రాజు

కాకినాడ, ఏపీ

149

కన్నెకంటి లాస్యా చౌదరి

ఖమ్మం

149

పల్లి వెంకట కౌశిక్‌ రెడ్డి

విజయవాడ, ఏపీ

148

రవి అభిరాం

రంగారెడ్డి

148

బి రామకృష్ణ షాలిగౌరారం

నల్లగొండ

148

Published date : 26 Aug 2021 05:41PM

Photo Stories