త్వరలో నాంపల్లి కోర్టులో మొదలవనున్న ఎంసెట్ లీకేజీ కేసువాదనలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో వెలుగుచూసిన ఎంసెట్-2 (మెడికల్) పేపర్ లీకేజీ స్కాంలో సీఐడీ వేగం పెంచింది.
సీఐడీ సమర్పించిన చార్జీషీటును ఇటీవల కోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో త్వరలో కేసు నాంపల్లి కోర్టులో ట్రయల్‌కు వచ్చేందుకు మార్గం సుగమమైంది. 2016 జూన్‌లో వెలుగుచూసిన ఈ కుంభకోణంపై సీఐడీ విచారణ జరిపింది. గత పరీక్షల్లో అత్తెసరు మార్కులు తెచ్చుకున్నవారు మెడికల్ స్కాం ద్వారా ఏకంగా మెడికల్ సీట్లు సాధించడంపై కొందరు తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో కుంభకోణం బట్టబయలైంది. ఈ క్రమంలో విచారణ జరిపిన సీఐడీ 90 మందిని నిందితులుగా చేర్చింది. దాదాపు 150 మంది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులను కలిపి సుమారు 300 మందిని సాక్షులుగా చేర్చింది. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత 2019 జూలైలో సీఐడీ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు. ఇది 3,500పైగా పేజీలు ఉండటం గమనార్హం. కేసులో నిందితులు తప్పించుకునేందుకు వీలులేకుండా ఉండాలన్న ఉద్దేశంతో సీఐడీ అధికారులు చాలా పకడ్బందీగా చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో శివబహదూర్ సింగ్ అలియాస్ ఎస్బీ సింగ్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో పనిచేసిన ఉద్యోగులూ అరెస్టవడం కలకలం రేపింది.
ఢిల్లీ ప్రెస్ నుంచే లీక్.. క్యాంపులతో కోచింగ్
ఢిల్లీ జేఎన్టీయూలోని ప్రింటింగ్ ప్రెస్ నుంచి ప్రశ్నపత్రాలు తీసుకొచ్చాక ఎస్బీ సింగ్ వాటిని దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్న తన ఏజెంట్లకు ఇచ్చాడు. వాళ్లు భువనేశ్వర్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీల్లో డబ్బులిచ్చిన విద్యార్థులకు క్యాంపులు పెట్టి ప్రశ్నపత్రానికి సంబంధించిన 4 సెట్లను ప్రాక్టీస్ చేయించారు. ఈ సమయంలో విద్యార్థులకు ఎక్కడా జిరాక్స్ కాపీలు అందివ్వలేదు. అన్ని సెట్లకు సంబంధించి కేవలం సమాధానాలు గుర్తుంచుకునేలా తర్ఫీదు ఇచ్చారు. ఈ క్రమంలో వివిధ మార్గాల్లో సేకరించిన ఆధార్ కార్డుల ద్వారా పలు సిమ్ కార్డులు తెప్పించారు. వాటితో ఎస్బీ సింగ్ బ్రోకర్లు, ఏజెంట్లు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వారిచ్చిన సూచనల మేరకు స్థానికంగా కాకుండా పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి తర్ఫీదు ఇచ్చారు. ఈ వ్యవహారంలో నారాయణ, శ్రీచైతన్య కాలేజీలకు చెందిన 9 మంది సిబ్బంది కీలకంగా వ్యవహరించారు.
విచారణలో ముగ్గురు నిందితుల మరణం..
ఈ కేసు ఆది నుంచి అనేక మలుపులు తిరిగింది. దర్యాప్తు చేసిన నాటి డీఎస్పీ బాలు జాదవ్, కానిస్టేబుల్ సదాశివరావు, మరో ఇన్‌స్పెక్టర్ నిందితుల నుంచి లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో వారిని సస్పెండ్ చేశారు. అలాగే దర్యాప్తు తీరుపై విమర్శలు రావడంతో కేసును సీఐడీకి బదిలీ చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సీఐడీ, ఢిల్లీలోని జేఎన్టీయూ ప్రింటింగ్ ప్రెస్ నుంచే పేపర్ లీక్ అయిన విషయాన్ని గుర్తించింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసికి చెందిన ఎస్బీ సింగ్‌ను సూత్రధారిగా తేల్చింది. ప్రశ్నపత్రాన్ని ఎస్బీ సింగ్ తన మనుషుల ద్వారా బయటకు తెప్పించాడని గుర్తించింది. ఈ వ్యవహారంలో ఇంటి దొంగలపైనా సీఐడీ దృష్టి సారించింది. ఈ కేసులో 62 మంది బ్రోకర్లు సహా మొత్తం 90 మందిని నిందితులుగా పేర్కొంది. 23 మంది పరారీలో ఉన్నట్లుగా చూపింది. స్థానికంగా ఎడ్యుకేషన్ కన్సల్టెంట్లు గుమ్మడి వెంకటేశ్, ఇక్బాల్‌లు విద్యార్థులకు లీక్ చేసిన పేపర్లను చేరవేసినట్లు దర్యాప్తులో తేలింది. వారితోపాటు శ్రీచైతన్య కాలేజీలో డీన్‌గా పనిచేసిన వాసుబాబు (ఏ-89), మరో ఏజెంట్ శివనారాయణరావు(ఏ-90)లతో కలిపి మొత్తం 90 మంది నిందితులుగా ఉన్నారు. నిందితుల్లో బిహార్‌కు చెందిన కమిలేశ్ కుమార్ సింగ్ (55), హైదరాబాద్‌లో పోలీసుల కస్టడీలో మరణించగా ఢిల్లీ జేఎన్టీయూ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేసే రావత్ (43) అనుమానాస్పద స్థితిలో మతిృచెందాడు. మరో నిందితుడు జితేందర్ సైతం పోలీసులకు చిక్కకుండానే మృతి చెందాడు.
వరంగల్‌లో మొదలై.. ఢిల్లీ దాకా..
వరంగల్ నుంచి మొదలైన సీఐడీ దర్యాప్తు ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, ముంబై, కటక్ తదితర ప్రాంతాలకు విస్తరించింది. పలుమార్లు విచారణాధికారులు మారడం, కేసులో జేఎన్టీయూ, శ్రీచైతన్య కార్పొరేట్ కళాశాల డీన్‌కు ఉన్న సంబంధాలు వెలుగుచూడటంతో కేసు మలుపులు తిరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ చరిత్రలో ఒక కుంభకోణంలో చార్జిషీట్ దాఖలుకు ఇంత సుదీర్ఘ సమయం తీసుకున్న అరుదైన కేసుగా ఎంసెట్ లీకేజీ ఘటన నిలిచింది. తాజాగా చార్జిషీటు దాఖలుతో కోర్టులో వాదనలు మొదలు కానున్నాయి.

Published date : 31 Jan 2020 02:50PM