టీఎస్ ఎంసెట్ విద్యార్థులకు సూచనలు...
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలు మే 2 నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 2 నుంచి 7వ తేదీ వరకు (నీట్ ఉన్నందున 6వ తేదీ మినహా) పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి 2,21,064 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం రెండు రాష్ట్రాల్లోని 18 జోన్ల పరిధిలో 87 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మే 2, 3 తేదీల్లో 75 కేంద్రాల్లో అగ్రికల్చర్ పరీక్ష... 4, 5, 7 తేదీల్లో 83 కేంద్రాల్లో ఇంజనీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. అగ్రికల్చర్ పరీక్షలకు 73,106 మంది, ఇంజనీరింగ్ పరీక్షకు 1,47,958 మంది దరఖాస్తు చేసుకున్నారు.
రెండు సెషన్లలో పరీక్షలు:
పరీక్ష తేదీల్లో రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్‌లో 25 వేల మంది వరకు విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉదయం సెషన్ 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, మధ్యాహ్నం సెషన్ 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, ఎంసెట్ కన్వీనర్ యాదయ్య వెల్లడించారు. ఆన్‌లైన్ ఎంసెట్ పరీక్షల్లోనూ నిమిషం నిబంధనను అమలు చేస్తున్నామని, నిర్ధారిత సమయం కంటే నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతించేది లేదని వారు స్పష్టం చేశారు. పరీక్షా సమయం కంటే రెండు గంటల ముందు నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. ఈసారి కొత్తగా నిజామాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లలోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.
ఏపీ నుంచి 29,356 మంది :
ఎంసెట్ పరీక్షలకు ఆంధ్రప్రదేశ్ నుంచి 29,356 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇంజనీరింగ్ పరీక్షకు 21,369 మంది, అగ్రికల్చర్ పరీక్షకు 7,987 మంది ఉన్నారు.
పరీక్షలు ముగిసిన వెంటనే ‘కీ’లు :
ఐదు రోజుల పాటు ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతున్నందున అన్ని పరీక్షలు పూర్తయ్యాక ప్రాథమిక ‘కీ’లను విడుదల చేసేలా ఎంసెట్ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షలు ముగిసే మే 7వ తేదీ రాత్రి లేదా 8న ‘కీ’లను విడుదల చేయనుంది. ఆన్‌లైన్ పరీక్షలు కావడంతో ప్రశ్నపత్రం ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు. అందువల్ల ‘కీ’లను విడుదల చేసే సమయంలో.. సంబంధిత కోడ్ ప్రశ్నపత్రం, ‘కీ’ రెండింటినీ విడుదల చేస్తారు. ఇక ప్రాథమిక ‘కీ’లపై మూడు రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. మొత్తంగా మే 15వ తేదీ నాటికి ఫలితాలను, ర్యాంకులను ప్రకటించేలా చర్యలు చేపట్టారు.
విద్యార్థులకు సూచనలివీ..
పరీక్ష రాసేముందు జాగ్రత్తలివీ..

- విద్యార్థులు హాల్‌టికెట్, బ్లూ లేదా బ్లాక్‌బాల్ పాయింట్ పెన్, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న ఫారాన్ని పరీక్ష కేంద్రానికి తీసుకురావాలి. ఈ దరఖాస్తు ఫారంపై ఫొటో అంటించి.. సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ లేదా గెజిటెడ్ అధికారి అటెస్టేషన్ చేయించి తేవాలి.
- ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన సమయంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు తమ కుల ధ్రువీకరణ పత్రం నంబర్ నమోదు చేయకపోతే.. ఇప్పుడు అటెస్టేషన్ చేయించిన కుల ధ్రువీకరణ పత్రం కాపీలను వెంట తెచ్చుకోవాలి.
- లాగ్ బుక్స్, టేబుల్స్, కాలిక్యులేటర్లు, పేజర్లు, సెల్‌ఫోన్లు వంటి ఏ ఎలక్ట్రానిక్ పరికరాలనూ పరీక్షా కేంద్రంలోకి తీసుకురావొద్దు. అలా తీసుకువస్తే మాల్ ప్రాక్టీస్ కేసు బుక్ చేస్తారు.
పరీక్ష రాసేముందు జాగ్రత్తలివీ..
- ఆన్‌లైన్ పరీక్ష అయినందున విద్యార్థులు సూచనలన్నింటినీ పూర్తిగా చదివాకే సమాధానాలు నమోదు చేయడం మొదలుపెట్టాలి.
- అందులో పేర్కొన్న సూచనల మేరకు ఆన్‌లైన్‌లో జవాబులను గుర్తించి టిక్ చేయాలి.
- జవాబు నమోదు చేసేందుకు ‘చూసెన్’ ఆప్షన్ బటన్ క్లిక్ చేయాలి. జవాబును మార్చాలంటే ‘అనదర్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఎంపిక చేసిన జవాబు వద్దనుకుంటే ‘క్లియర్ రెస్పాన్స్’ బటన్ క్లిక్ చేయాలి.
- జవాబును సేవ్ చేసి.. మరో ప్రశ్నకు వెళ్లేందుకు ‘సేవ్ అండ్ నెక్ట్స్’ బటన్‌ను క్లిక్ చేయాలి.
- 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. 180 నిమిషాల సమయం ఇస్తారు. తప్పు జవాబులు రాస్తే నెగెటివ్ మార్కులు ఉండవు.
- కంప్యూటర్ స్క్రీన్‌పై కుడి భాగంలో కౌంట్‌డౌన్ టైమర్ ఉంటుంది. సమయం గడుస్తున్నకొద్దీ.. ఇంకా మిగిలిన సమయాన్ని సూచిస్తుంది. అది సున్నాకు వచ్చిందంటే పరీక్ష ముగిసినట్టే.
Published date : 02 May 2018 02:33PM