Skip to main content

టీఎస్ ఎంసెట్ సర్టిఫికెట్ల పరిశీలనకు మరో అవకాశం

సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్-2017 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు కన్వీనర్ వాణీప్రసాద్ ఈనెల 21న ఓ ప్రకటనలో తెలిపారు.
మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులు ఈనెల 22న పరిశీలనకు రావొచ్చని ఆమె సూచించారు. ఈనెల 21 నాటి సర్టిఫికెట్ల పరిశీలనకు 6,072 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 23లోపు ఆయా అభ్యర్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకోవాలని, ఎంపిక చేసుకున్న వారు 22, 23 తేదీల్లో వెబ్ ఆప్షన్లు మార్చుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటివరకు మొత్తంగా 63,803 మంది విద్యార్థులు పరిశీలనకు హాజరయ్యారని, వీరిలో ఓయూ పరిధి నుంచి 60,920 మంది, ఆంధ్రా వర్సిటీ 1,623 మంది, శ్రీవేంకటేశ్వర 870 మంది, నాగార్జున వర్సిటీకి సంబంధించి 390 మంది ఉన్నారని తెలిపారు. వీరిలో ఇప్పటికే 53,872 మంది విద్యార్థులు ఆప్షన్లు ఎంపిక చేసుకున్నారని, సర్టిఫికెట్ల పరిశీలన సమాచారాన్ని https://tsecet.nic.in వెబ్‌సైట్ నుంచి పొందొచ్చని సూచించారు.

ఇంజనీరింగ్‌లో 62746 సీట్లు..
ఎంసెట్, బీఫార్మసీ, ఫార్మాడీ కేటగిరీల్లో సీట్లపై టీఎస్‌ఎంసెట్ కన్వీనర్ స్పష్టతనిచ్చారు. ఇంజనీరింగ్ కేటగిరీలో 196 కాలేజీల పరిధిలో 62,746 సీట్లున్నాయి. వీటిలో 14 యూనివర్సిటీ కాలేజీల్లో 3,060 సీట్లు, 182 ప్రైవేటు కాలేజీల్లో 59,686 సీట్లున్నాయి. అదేవిధంగా బీఫార్మసీ విభాగంలో 111 కాలేజీల్లో 2,937 సీట్లు, ఫార్మా డీ కేటగిరీలో 43 కాలేజీల్లో 430 సీట్లున్నాయి.
Published date : 22 Jun 2017 02:53PM

Photo Stories