టీఎస్ ఎంసెట్ ప్రవేశాల పక్రియ: వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న 28,674 మంది
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ప్రవేశాల కోసం మంగళవారం సాయంత్రం వరకు 28,674 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నట్లు ఎంసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ తెలిపారు.
సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 55,531 మంది విద్యార్థులు హాజరయ్యారని, రాత్రి 11.59కి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినట్లు స్పష్టంచేశారు. అందులో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు 40,023 మంది పాస్‌వర్డ్ జనరేట్ చేసుకున్నారని తెలిపారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఈనెల 22 చివరి తేదీ అని పేర్కొన్నారు. విద్యార్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, ఇప్పటివరకు ఒకరు గరిష్టంగా 749 ఆప్షన్లను ఇచ్చుకున్నారని వివరించారు.
Must Check: TS EAMCET Mock Counselling / College Predictor
Must Check: TS EAMCET Mock Counselling / College Predictor
Published date : 21 Oct 2020 02:00PM