Skip to main content

టీఎస్ ఎంసెట్-2019 ఫలితాలు మరింత ఆలస్యం

సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఎంసెట్-2019 ఫలితాలు మరింత ఆలస్యం కానున్నాయి.
ఇంటర్ ఫలితాల సమాచారం కోసం ఎంసెట్ కమిటీ ఎదురుచూస్తోంది. ఎంసెట్-2019 నిర్వహించిన జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ-హైదరాబాద్‌కి ఇంటర్ ఫలితాల సమాచారాన్ని ఇవ్వడంలో ఇంటర్ బోర్డు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యమే ఇందుకు ప్రధాన కారణం. ఇటీవల ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 5వ తేదీన ఎంసెట్ కమిటీకి ఇంటర్ ఫలితాల డేటాను అందిస్తామని తెలిపారు. 5వ తేదీకి డేటాను ఇస్తే రెండు, మూడు రోజుల్లో 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ఫలితాలు ప్రకటించవచ్చని అంతా అనుకున్నారు. కానీ బోర్డు జూన్ 6వ తేదీ సాయంత్రానికి కూడా డేటా ఇవ్వకపోవడంతో ఎంసెట్ ర్యాంకుల ప్రకటన ఆలస్యం కానుంది. ఇంటర్ ఫలితాల ప్రకటనలో వివాదం నెలకొనడంతో తెలంగాణ ప్రభుత్వం రీవెరిఫికేషన్, రీవ్యాలిడేషన్‌కు ఆదేశించిన విషయం తెలిసిందే. మే నెల చివరన హైకోర్టు ఆదేశాల మేరకు ఆ ఫలితాలను ప్రకటించిన బోర్డు ముందుగా 1,137 మంది విద్యార్ధులు పాసైనట్లు ఫలితాలు వెల్లడించింది. కానీ రీవెరిఫికేషన్, రీవ్యాలిడేషన్ పూర్తి కాకపోవడంతోనే ఇంటర్ బోర్డు ఆలస్యానికి మరో కారణమని తెలుస్తోంది.
Published date : 07 Jun 2019 03:48PM

Photo Stories